థియేటర్లకు కష్టాలు, ఓటీటీకి లాభాలు

దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న విషయం తెల్సిందే.లాక్‌డౌన్‌ దెబ్బతో పలు కంపెనీలు మూత పడే పరిస్థితి వచ్చింది.

ఇక సినిమా రంగంపై కూడా ఈ దెబ్బ మరీ ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా థియేటర్లకు రాబోయే ఆరు నెలల పాటు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అంటున్నారు.

దాంతో సినిమాలు విడుదల అయినా కూడా తక్కువ థియేట్రికల్‌ రైట్స్‌కు అమ్ముడు పోయే అవకాశం ఉంది అంటున్నారు.

ప్రస్తుతం జనాలు అంతా కూడా ఓటీటీపై పడుతున్నారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లపై సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఖర్చు చేసి మరీ కొత్త సినిమాలను కొనుగోలు చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.

Advertisement

ఆ కారణంగా చిన్న సినిమాలకు కూడా మంచి ఆదాయం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం సినిమాలు షూటింగ్స్‌ అన్ని ఆగిపోయాయి.మరో రెండు నెలల వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

ఆ తర్వాత మళ్లీ మొల్లగా సినిమాల వ్యాపారాలు మొదలు అయ్యే అవకాశం ఉంది.థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా గతంలో మాదిరిగా భారీ మొత్తాలు రావాలంటే కనీసం సంవత్సరం అయినా సమయం పడుతుందనే టాక్‌ వినిపిస్తుంది.

అందుకే అల్లు అరవింద్‌ వంటి వారు ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లను ప్రారంభించారు.ఇంకా పలు ఓటీటీలు రాబోతున్నాయి.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు