సినిమా ఇండస్ట్రీ లో ఎలాగైనా నెగ్గాలి అనుకుంటే ఖచ్చితంగా రీమేక్స్, సీక్వెల్స్, బయోపిక్స్ తీయడం వంటివి చేయాలి.సీక్వెల్ అంటే అది క్యాస్ట్ తో తీయచ్చు లేదా మార్చచ్చు.
కొన్ని సార్లు పక్క బాషల సినిమాల కంటే తెలుగు లోనే ఎక్కువగా సీక్వెల్స్ వస్తున్నాయి అందులో కొని ఫ్లాప్ అవుతున్నాయి.ఆలా మనల్ని నిరాశపరిచిన తెలుగు మూవీ సీక్వెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
మనీ:

వర్మ శిష్యుల్లో టాలీవుడ్ లో చాల మంది దర్శకులు ఉన్నారు.అందులో ఒకరు అయినా నాగేశ్వర రావు మని అనే సినిమా తీయగా అది చాల బాగా వర్క్ అవుట్ అయ్యింది.దాని తర్వాత వచ్చిన మని మని, మని మని మోర్ మని విజయాలను సాధించడం లో విఫలం అయ్యాయి.
శంకర్ దాదా mbbs/ జిందాబాద్ :

హిందీ చిత్రం అయినా మున్నా భాయ్ ఎం బి బి ఎస్ చిత్రాన్ని తెలుగు లో చిరంజీవి హీరో గా పెట్టి తీస్తే చాల పెద్ద హిట్ అయ్యింది.ఈ సినిమా లో మ్యూజిక్ నిజంగానే మ్యాజిక్ చేసింది.ఇక ప్రభుదేవా దర్శకత్వం లో వచ్చినా సీక్వెల్ శంకర్ దాదా జిందాబాద్ మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది.
ఆర్య :

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన సినిమా ఆర్య.ఫ్రెష్ లవ్ ఫీల్ క్రియేట్ చేస్తూ ఈ చిత్రం చాల బాగా వచ్చింది.ఇందులో పాటలు, డ్యాన్సులు కూడా యువతను బాగా ఆకర్షించాయి.ఇక ప్రేమను మించి స్నేహాన్ని చూపిస్తూ తీసిన సీక్వెల్ ఆర్య 2 మాత్రం ఫ్లాప్ చిత్రం గా నిలిచింది.
కిక్ :

కామెడీ యాంగిల్ తో రవి తేజ హీరో గా చేసిన సినిమా కిక్. ఈ సినిమాలో రవి తేజ మంచి ఎనర్జీతో కనిపిస్తాడు.ఈ సినిమాలో థమన్ సంగీతం కూడా చాల బాగుంటుంది.ఈ సినిమాకు కొనసాగింపు గా వచ్చిన కిక్ సీక్వెల్ జనాలకు చిరాకు తెప్పించింది.కథలో దమ్ము లేకపోవడం తో ఫ్లాప్ అయ్యింది.
గబ్బర్ సింగ్ :

హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన మాస్ మూవీ గా పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు దర్శకుడు.కానీ బాబీ దర్శకత్వం లో వచ్చిన సీక్వెల్ సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం అందరిని పూర్తిగా నిరాశపరిచింది.
మన్మధుడు – మన్మధుడు 2 , చంద్రముఖి – నాగవల్లి వంటి మరిన్ని సినిమాలు వచ్చిన అవి కూడా విజయాన్ని అందుకోలేక చతికల పడ్డాయి.







