Tollywood Movies Japan: జపాన్ లో ఏ తెలుగు సినిమా ఎంత కలెక్షన్స్ సాధించిందో తెలుసా ?

బాహుబలి తరువాత తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది.ఇక RRR, తరువాత పుష్ప సినిమా తరువాత తెలుగు సినిమా గ్లోబల్ సినిమా అయిపోయింది.

 Tollywood Movies Collections In Japan Rangasthalam Rrr-TeluguStop.com

తాజాగా RRR సినిమాకి ఆస్కార్ కూడా వచ్చింది.దీంతో అందరి కళ్ళు తెలుగు సినిమాలపై పడింది.

దీంతో తెలుగు సినిమాలకు ఇక్కడే కాదు బయట కూడా కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుంది.బాహుబలి( Baahubali ) సినిమాతో దర్శకుడు రాజమౌళి ఇండియా స్థాయిని పెంచి భారీగా కలెక్షన్స్ సాధించవచ్చని నిరూపించారు.

దీంతో మిగితా దర్శకులకి, నిర్మాతలకి నమ్మకం పెరిగింది.బాహుబలి, RRR తరువాత రాజమౌళి పేరు మారుమ్రోగుతుంది.

రాజమౌళి తరువాత సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.ముందు బాలీవుడ్ లో అదరగొట్టిన తెలుగు సినిమాలు ఆ తరువాత వరల్డ్ వైడ్ గా అలాంటి రెస్పాన్స్ అందుకుంటోంది.

ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పిస్తోంది.

Telugu Salaar, Bahubali, Devara, Japan, Prabhas, Project, Pushpa, Rajamouli, Ram

ఇప్పుడు జపాన్ లో ( Japan ) తెలుగు సినిమాల హావ నడుస్తుంది.కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూ అందరిని షాక్ కి గురిచేస్తుంది.ముందు జపాన్ లో RRR సంచలనం సృష్టించింది.RRR అక్టోబర్ 21, 2022లో జపాన్ లో రిలీజ్ అయ్యింది.200 రోజులకు పైగా ధియేటర్లో ఆడి 120 కోట్ల హయస్ట్ కలెక్షన్లతో షాక్ కి గురిచేసింది.అంతే కాదు జపాన్ లో RRR కొత్త రికార్డు సృష్టించింది.అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది.ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.

Telugu Salaar, Bahubali, Devara, Japan, Prabhas, Project, Pushpa, Rajamouli, Ram

లేటెస్ట్ గా జపాన్ లో రంగస్థలం సినిమా( Rangasthalam ) రిలీజ్ అయ్యింది.ఈ సినిమా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతుంది.మొదటి రోజే 15 లక్షల కలెక్షన్లతో రికార్డు సృష్టించింది.

ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే.రామ్ చరణ్ కెరీర్ ఓ రంగస్థలం బ్లాక్ బస్టర్ సినిమా.

ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుంది.మొత్తానికి తెలుగు సినిమాలకు జపాన్ లో కొత్త మార్కెట్ క్రియేట్ అయ్యింది అనే చెప్పాలి.

ఇప్పుడు మరిన్ని సినిమాలు ఫ్యాన్ ఇండియా విడుదలకు సిద్ధం అవుతున్నాయి.సలార్, ప్రాజెక్ట్ K, దేవర, పుష్ప 2 వంటి సినిమాలు ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసాయి.

ఈ సినిమాలన్నీ భారీ విజయాలు సాధిస్తే తెలుగు సినిమా మరోస్థాయికి వెళ్ళిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube