కేవలం రెండు సీన్లతో సూపర్ హిట్ అయినా సినిమాలు ఇవే !

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కేవలం తక్కువ కథలే ఉంటాయి.

వాటినే అటు తిప్పి ఇటు తిప్పి కొంత ట్విస్టులు జత చేసి, స్క్రీన్ ప్లే తో మాయ చేసి సినిమా రూపంలో అభిమానుల ముందుకు తీసుకోస్తారు సినిమా మేకర్స్.

కథ ఎలా ఉన్న కొన్ని సన్నివేశాలు మాత్రమే సినిమాను రక్తి కట్టిస్తాయి ఏవ్ సినిమాకి ప్రాణం కూడా పోస్తాయి.సినిమాల్లో వచ్చే ఆ సీన్లతో మంచి హైప్ వస్తుంది.

దాంతో అలాంటి కొన్ని ముఖ్యమైన సీన్స్ వచ్చినప్పుడు థియేటర్ లో చప్పట్లు, విజిల్స్ పడతాయి.అవి చూడటానికి జనాలు థియేటర్ కి మళ్లీ మళ్లీ వస్తుంటారు.

మరి ఆలా సీన్స్ తో హైలెట్ అయ్యి హిట్టు కొట్టిన సినిమాలు ఏంటో చూద్దాం.

గబ్బర్ సింగ్

ఇక పవన్ కళ్యాణ్ కి అనేక ఫ్లాప్స్ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది.

Advertisement

ఈ సినిమాలో అంత్యాక్షరి సీన్ జనాలకు బాగా నచ్చింది.ఏ సీన్ కోసం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్ కి వెళ్లారంటే అతిశయోక్తి లేదు.

సమర సింహ రెడ్డి

బాలకృష్ణ నటించిన అనేక ఫ్యాక్షన్ సినిమాల్లో సమర సింహ రెడ్డి సినిమా మంచి హిట్ అయ్యింది.ఇక ఈ సినిమాలో వచ్చిన ట్రైన్ సీన్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

అంజి

చిరంజీవి నటించిన అంజి సినిమా ఫ్లాప్ టాక్ తో చిరు కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా క్లైమాక్స్మాత్రం అద్భుతంగా ఉంటుంది.

మగధీర

రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో మన అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది.క్లైమాక్స్ లో వచ్చే షేర్ ఖాన్ ఎంట్రీ, అలాగే కాజల్ పునర్జన్మ కి గుర్తుకు రావడం, విలన్ తో ఫైట్ సీన్ చక్కగా కుదిరి ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ప్రభాస్

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రభాస్ నటించిన మిర్చి సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో విలన్ దగ్గర పాలేరు గా పని చేసే వ్యక్తి కూతురికి మెడికల్ సీట్ కోసం కాలేజీ కి వెళ్లి అక్కడ మాట్లాడే సీన్ ఎంతో హైలెట్ గా మారింది.ఈ ఒక్క సీన్ తో సినిమా ఘనవిజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు