టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి కనుమరుగైన విలన్లు వీరే..!!

ఏ సినిమాలోనైనా హీరోహీరోయిన్లు ఉండటం ఎంత ముఖ్యమో విలన్ కూడా ఉండటం అంతే ముఖ్యం.

కొన్ని సినిమాలు హీరోయిన్ లేకుండానే చేశారు కానీ విలన్స్ లేకుండా ఇప్పటి వరకు పట్టుమని పది టాలీవుడ్ సినిమాలు కూడా తీయలేదు.

సినిమాకి హీరో అంత అవసరమో విలన్ కూడా అంతే అవసరమని చెప్పుకోవచ్చు.అయితే విలన్ పాత్రను పోషించే నటీనటులకు అద్భుతమైన నటనా ప్రతిభతో పాటు భీకరమైన ఆహార్యం కచ్చితంగా ఉండాలి.

అప్పుడే కథానాయకుడికి సమవుజ్జీగా ప్రతినాయకుడు నిలుస్తాడు.అయితే టాలీవుడ్ పరిశ్రమలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన వారు.

హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారిన వారు ఎందరో ఉన్నారు.గత దశాబ్దంలో విలన్లుగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటుల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1.రామిరెడ్డి

Advertisement

చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన గంగసాని రామిశెట్టి జర్నలిజం లో బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు.ఐతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం లో డిగ్రీ పట్టా పొందిన రామిరెడ్డి కొంతకాలం పాటు ఒక పత్రికకు పనిచేశారు.ఆ తరువాత వెండితెరకు పరిచయమయ్యారు.

అంకుశం సినిమాలో విలన్ పాత్రలో నటించిన రామిరెడ్డి కి బాగా గుర్తింపు దక్కింది.ఆ తర్వాత ఆయన ఒసేయ్ రాములమ్మ, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు వంటి చిత్రాల్లో నటించి గొప్ప విలన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 250 చిత్రాల్లో నటించారు.కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ తో బాధ పడిన రామిరెడ్డి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2011 వ సంవత్సరంలో చనిపోయారు.

2.శ్రీహరి

రియల్ స్టార్ శ్రీహరి స్టంట్ మాస్టర్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, నిర్మాతగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో రాణించారు.బ్రహ్మనాయుడు, ధర్మక్షేత్రం సినిమాల ద్వారా ఆయన వెండితెరకు నటుడిగా పరిచయం అయ్యారు.ఆయన హీరోగా నటించిన భద్రాచలం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో శ్రీహరి అనారోగ్యం పాలై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.49 ఏళ్లకే శ్రీహరి మరణించడం టాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది.జిమ్నాస్టిక్స్‌ ఆటగాడైన శ్రీహరి కి యుక్తవయసులో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రైల్వే ఆఫీసర్ జాబ్స్ వచ్చాయి కానీ ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసి ఘటనపై మక్కువతో సినిమా రంగంలో అరంగేట్రం చేశారు.

3.ఆహుతి ప్రసాద్

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

మొదట్లో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆహుతిప్రసాద్ ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించి మెప్పించారు.మూడు దశాబ్దాల కాలంలో 150 సినిమాల్లో నటించి మెప్పించిన ఆహుతిప్రసాద్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే కాలం మరణం చెందారు.నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాలో అద్భుతమైన నటనా ప్రదర్శన కనబరిచినందుకు గాను ఆహుతి ప్రసాద్ కి ఉత్తమ విలన్ గా నంది అవార్డు లభించింది.

Advertisement

చందమామ సినిమాకి ఆయనకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు లభించింది.

తాజా వార్తలు