బాలీవుడ్ ను టాలీవుడ్ ఓడించిందా... అక్కడి హీరోలకు ఇక్కడ విలన్ పాత్రలే దక్కుతున్నాయా?

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood ) సినిమాలు భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించేవి.

ఆ సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలపై( South Movies ) చిన్న చూపు ఉండేది.

బాలీవుడ్ యాక్టర్లకు సౌత్ సినిమాలలో అవకాశం వచ్చినా ఎక్కువ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం వల్ల సౌత్ సినిమాలలో వాళ్లను తీసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు.అయితే ఇప్పుడు మాత్రం లెక్కలు మారిపోయాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీని టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood ) ఓడించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అక్కడ హీరో రోల్స్ పోషించిన నటులు ఇప్పుడు తెలుగులో విలన్ రోల్స్ పోషిస్తున్నారు.

టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు హిట్ టాక్ వస్తే కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం గమనార్హం.బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్( Salman Khan ) గాడ్ ఫాదర్ సినిమాలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

Tollywood Industry Become Top Saif Ali Khan Arjun Rampal Sanjay Dutt Details, To
Advertisement
Tollywood Industry Become Top Saif Ali Khan Arjun Rampal Sanjay Dutt Details, To

ఇప్పుడు బాలీవుడ్ హీరోలలో చాలామంది టాలీవుడ్ హీరోలకు విలన్లుగా చేస్తున్నారు.ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ దేవరలో( Devara ) సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరి సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నారు.

సంజయ్ దత్ సైతం సౌత్ సినిమాలలో అవకాశాలు వస్తే వాటిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.

Tollywood Industry Become Top Saif Ali Khan Arjun Rampal Sanjay Dutt Details, To

అయితే ఈ బాలీవుడ్ విలన్లు సౌత్ సినిమాలకు ఓకే చెబుతున్నా అదే సమయంలో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ విలన్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.బాలీవుడ్ విలన్లను ఎంచుకోవడం ద్వారా సినిమాలకు బిజినెస్ భారీగా జరుగుతోంది.

కోలీవుడ్ మేకర్స్ సైతం సినిమాలకు సంబంధించి ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు