నాని నుంచి నితిన్ వరకు సినిమా ప్రమోషన్ సోలోగా చేసుకుంటున్న హీరోలు

ఏదైనా సినిమా ప్రచారం జరగాలంటే దానికి సంబంధించిన హీరో హీరోయిన్స్ చాలా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది.

ఇటీవల విడుదలైన ఆనిమల్ సినిమా విషయంలో రణబీర్ కపూర్, రష్మిక మందన చక్కగా ప్రమోషన్ చేయడం వల్లే అది అన్ని భాషల్లో జనాలకు బాగా రీచ్ అయింది.

కంటెంట్ కూడా అందుకు తగ్గట్టుగా బాగా ఉండటంతో అది 1000 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది.అయితే టాలీవుడ్( Tollywood ) లో మాత్రం ఈ పరిస్థితి అన్ని సినిమాలకు కనిపించడం లేదు.

కొంతమంది హీరోలు తమ సినిమాను సోలో గాని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.హీరోయిన్స్ మాత్రం ప్రమోషన్స్ అంటే నో ఛాన్స్ అంటున్నారు.

మరి ఇటివల కాలంలో ఈ ఒరవడి బాగా ఎక్కువయింది.అలా ప్రమోషన్స్ కి డుమ్మా కొడుతున్న హీరోయిన్స్ ఎవరో ఆ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mr.Polishetty ) సినిమా టైంలో అనుష్క ఆ సినిమా ప్రమోషన్స్ కి రాకపోవడంతో నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty )అన్ని బాధ్యతలు తన భుజాలపై మోసి సినిమాను సక్సెస్ బాట పట్టించుకున్నారు.ఇక అదే దోవలో వాల్తేరు వీరయ్య టైంలో శృతి హాసన్ కూడా చిరంజీవికి హ్యాండ్ ఇచ్చింది.

వీర సింహారెడ్డి ప్రమోషన్స్ కి హాజరైన శృతిహాసన్ మరునాడు జరిగిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఫంక్షన్ కి రాకపోవడంతో అందరూ ఆమె గురించి మాట్లాడుకున్నారు.ఇక మొదటి నుంచి నయనతార ఏ సినిమా ఫంక్షన్ కి కూడా హాజరయింది లేదు సినిమా ప్రమోషన్స్ చేసింది లేదు.

వీరి సంగతి పక్కన పెడితే ఇప్పుడు తాజా సినిమాల్లో కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతోంది.

నితిన్( Nitin ) హీరోగా శ్రిలీల హీరోయిన్ గా నటిస్తున్న ఎక్స్ట్రాడినరీ సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా నితిన్ ఒక్కడే చేస్తున్నాడు.అందుకు గల కారణం మిగతా మిగతా సినిమాల షెడ్యూల్స్ లో బిజీగా ఉండడమే అని తెలుస్తోంది.మరి నితిన్ సినిమాపై శ్రలీల ఇంట్రెస్ట్ కూడా పెద్దగా పెట్టినట్టు కనిపించడం లేదు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మరోవైపు హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా నాని సింగిల్ గానే కానిచ్చేస్తున్నారు.ఈ సినిమాలో నటించిన మృనాల్ ప్రమోషన్స్ అంటే నో చెబుతుందట.ఇక మరోవైపు సలార్ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

Advertisement

మామూలుగానే ప్రభాస్ ఏ సినిమా ఫంక్షన్ కి, ప్రమోషన్స్ కి హాజరు కాడు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు శృతిహాసన్ కూడా సినిమా ప్రమోషన్స్ చేయడానికి ఒప్పుకోలేదు అని తెలుస్తుంది.

మరి ప్రశాంత్ నీల్ ఒక్కడే సినిమాను ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి.

తాజా వార్తలు