తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ వంద కోట్ల క్లబ్ లో చేరని.. ఏకైక స్టార్ హీరో అతనేనట?

సినిమా అనే రంగుల ప్రపంచంలో విజయం ఉన్నవాడిదే రాజ్యం.ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాలు విజయం సాధించకపోతే ఇక హీరో కనుమరుగు అవుతూ ఉంటాడు.

ఇటీవలి కాలంలో అయితే కేవలం విజయం సాధించడమే కాదు వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న హీరోలకి క్రేజ్ కూడా పెరిగిపోతుంది.అయితే ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు మాత్రమే వంద కోట్ల క్లబ్లో చేరిపోతు ఉండేవి.

కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రతి సినిమా కూడా ఎంతో సులభంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది.కేవలం ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో మంది హీరోలు తమ సినిమాలతో వంద కోట్ల క్లబ్లో చేరి పోయారు.

కాగా ఇప్పటి వరకు టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ లు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు.అయితే ఇప్పటికి వంద కోట్ల రికార్డును అందుకొని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పాలి.

Advertisement

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నెంబర్ వన్ హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానులు ఆయనను ఆదరిస్తూ ఉంటారు.

అయితే పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాలో నటిస్తున్నాడు అంటే చాలు ఆ సినిమాకి ఊహించని రేంజిలో హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.

అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో ఇక పవన్ కళ్యాణ్ మొదటి సారి వంద కోట్ల క్లబ్ లో చేరిపోతాడు అని అందరూ అనుకున్నారు.కానీ ఇక భీమ్లా నాయక్ సినిమా మాత్రం కేవలం 95 కోట్ల షేర్స్ మాత్రమే వసూలు చేసిందట.అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల రేట్లు తగ్గించడం వల్ల ఇక సినిమా వసూళ్లపై ప్రభావం పడిందని అని అందరి భావనా.

ఎందుకంటే భీమ్లా నాయక్ సినిమాపై ఉన్న అంచనాలు ఇక ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ చూస్తే ఈ సినిమా వంద కోట్లు కొల్లగొట్టడం ఖాయం అని అందరూ అనుకున్నారు.కానీ అనుకోని ఇబ్బందుల కారణంగా చివరికి ఈ సినిమాకు ఇబ్బందులు తప్పలేదు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

ఇలా అందరు హీరోలు వంద కోట్ల క్లబ్లో సులభంగా చేరుకోగా ఇక పవన్ కళ్యాణ్ మాత్రంనేను మాత్రం ఇంకా చేరలేదు.మరి రాబోయే సినిమాలు అయినా 100 కోట్ల వసూళ్లు సాధిస్థాయా లేదా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు