ఆ హీరో మరణం నన్ను ఎంతగానో కలచి వేసిందంటున్న నిఖిల్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన టువంటి హ్యాపీ డేస్ చిత్రంలో కాలేజీ కుర్రాడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.

అయితే నిఖిల్ తన సినీ కెరీర్ ప్రారంభించిన మొదట్లో కొంత మేర అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ మెల్ల మెల్లగా తన చిత్రాలు విజయం సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే తాజాగా  నిఖిల్ తన అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సేపు  ముచ్చటించాడు. అయితే ఇందులో భాగంగా తన సినీ జీవితానికి సంబంధించినటువంటి పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంపై స్పందిస్తూ సినీ జీవితం పరంగా  భవిష్యత్తు ఉన్నటువంటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం తనను ఎంతగానో కలచి వేసిందని చెప్పుకొచ్చాడు.అంతేకాక సినీ పరిశ్రమలో ఎవరిని ఎవరు తొక్కేయడం, మరియు ఎదగనివ్వకుండా చేయడం, అవకాశాలు రాకుండా చేయడం వంటివి చేయరని, ఏదైనా తాము ఇతరులతో నడుచుకునే ప్రవర్తనను బట్టి మన జీవితం సాగిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అంతేకాక తనకి ఎప్పుడూ కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని కూడా తెలిపాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న కార్తికేయ-2 అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

ఈ చిత్రం నిఖిల్ సిద్ధార్థ్ గతంలో హీరోగా నటించినటువంటి కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా ఉంది.కాగా ఇటీవలే ప్రముఖ దర్శకుడు కుమారి 21ఎఫ్ మూవీ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న 18 పేజెస్ అనే చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 .

Advertisement

తాజా వార్తలు