తెలుగులో పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మరియు ప్రేమ తరహా చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నిన్నటి తరం హీరో తరుణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఒకప్పుడు వరుస హిట్ చిత్రాలతో బాగానే రాణించిన తరుణ్ క్రమ క్రమంగా తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఈ మధ్య సినీ పరిశ్రమలో హీరోగా తన ఉనికిని చాటుకునేందుకు చతికల పడుతున్నాడు.
అయితే తరుణ్ తల్లిదండ్రులు కూడా సినిమా పరిశ్రమకి చెందిన వారు కావడంతో చిన్నప్పుడే తరుణ్ బాల నటుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.అయితే చిన్నప్పుడు తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆదిత్య 369 అనే చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత నటించిన “తేజ” అనే చిత్రం ఏకంగా తరుణ్ కి నంది అవార్డు ని కూడా తెచ్చి పెట్టింది. అయితే ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువుపై దృష్టి సారించిన తరుణ్ 2000 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కే. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన “నువ్వే కావాలి” అనే చిత్రంలో హీరోగా నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.
ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.
అంతేగాక తరుణ్ కి నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.ఇక ఆ తర్వాత తరుణ్ నటించినటువంటి ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, ఎలా చెప్పను, ఇలా దాదాపుగా చాలా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో చివరిగా 2018 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు రమేష్ గోపి దర్శకత్వం వహించినటువంటి “ఇది నా లవ్ స్టోరీ” అనే చిత్రంలో హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో అప్పటి నుంచి తన తదుపరి చిత్ర కథల విషయంలో తరుణ్ కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం తరుణ్ కి 37 సంవత్సరాలు రావడంతో అతడి తల్లిదండ్రులు పెళ్లి చేసే పనిలో పడినట్లు సమాచారం.
అంతేగాక ఇప్పటికే తరుణ్ తల్లి రోజా రమణి స్నేహితురాలు అయినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్త కూతురిని తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.