సాధారణంగా ఎవరైనా హీరోయిన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్పాట్‌లైట్‌లోకి వస్తే ఆమె వద్దకు తెలుగు దర్శక నిర్మాతలు క్యూ కడతారు.అనేక ఆఫర్లను ఆమె ముందు ఉంచి ఏవేవో సినిమాలు చేయిస్తారు.
అవి ఫ్లాప్ అయితే మళ్లీ ఈ హీరోయిన్ కెరీర్ తలకిందులు అవుతుంది.రీసెంట్ ఎగ్జాంపుల్ గా శ్రీలీల( Sreeleela ) అని చెప్పుకోవచ్చు.
ఈ ముద్దుగుమ్మ డాన్స్ అదరగొడుతుంది.చాలా అందంగా కూడా ఉంటుంది.
గ్లామర్ షో చేస్తుంది.రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించేస్తుంది కాబట్టి ఈ తారకు సూపర్ క్రేజ్ వచ్చింది అందువల్ల ఈ ముద్దుగుమ్మకు దర్శక నిర్మాతలు అనేక అవకాశాలను అందించారు.
అడిగినంత డబ్బులను కూడా ఆమె బ్యాంక్ అకౌంట్లో కుమ్మరించారు.

అయితే ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల అవకాశాలు తగ్గాయి.మెడిసిన్ లాస్ట్ ఇయర్ లో ఉంది కాబట్టి కావాలనే మూవీ ఆఫర్లను ఆమె రిజెక్ట్ చేస్తోందని అంటున్నారు కానీ ఫ్లాపుల వల్లే ఆమెకు ఆఫర్స్ సన్నగిల్లి ఉండవచ్చు.ఈ హీరోయిన్ తర్వాత ఇప్పుడు తెలుగు దర్శకనిర్మాతల కన్ను మలయాళ బ్యూటీ మమతా బైజు మీద పడింది.
మలయాళం రొమాంటిక్ కామెడీ ఫిలిం “ప్రేమలు( Premalu )” ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇది తెలుగులో కూడా రిలీజ్ అయింది.
ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన ఈ ముద్దుగుమ్మ చాలామంది హృదయాలను దోచేసింది.మమతా బైజు( Mamitha Baiju ) వల్లే ఈ సినిమాకి ఇప్పటికే ఐదు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్ లో డబ్బులు రావడం అంటే అది సూపర్ హిట్ గా చెప్పుకోవచ్చు.

ఈ మూవీలోని ఈ తార నటనకు ఫిదా అయిపోయిన మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారట.కానీ ఆమెతో సినిమా చేయడం అంత ఈజీ కాదు అని తెలుస్తోంది.కేరళలోని కొట్టాయంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కొచ్చిలో సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తోంది.
ఈ 22 ఏళ్ల తార 2017 నుంచి సినిమాల్లో నటిస్తోంది.సంవత్సరానికి ఈ రెండు సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.ఇటీవల తమిళంలో “వనంగాన్” అనే ఓ సినిమా చేయడానికి ఆమె ఒప్పుకుంది.దానికి డైరెక్టర్ బాల దర్శకత్వం వహిస్తున్నాడు.
తమిళంలో ఆమెకు ఇదే మొదటి సినిమా.అయితే ఆమె మంచిగా నటించడం లేదని దర్శకుడు తిట్టాడట.
అందుకే ఆ మూవీ నుంచి ఆమె తప్పుకుందని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ విషయంలో విభేదాలు రావడం వల్ల తాను ఈ సినిమా నుంచి బయటికి వచ్చాను అని చెప్పింది.
ఈమె ఈ మూవీ రిజెక్ట్ చేయడం చూస్తుంటే తెలుగులో ఆఫర్లను కూడా ఇలానే రిజెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.