ఒక్క ఫ్లాప్ సినిమా తీయ‌ని 6 గురు టాలీవుడ్ ద‌ర్శ‌కులు వీళ్ళే..!!

సినిమా రంగ‌మే రంగుల మ‌యం. కొంద‌రు డైరెక్ట‌ర్లు ప‌ట్టింద‌ట్లా బంగారం అయితే.

మ‌రికొంద‌రు తీసిన చిత్రాల‌న్నీ ఫ్లాఫ్‌గా నిలుస్తాయి.అలా ఇప్ప‌టి వ‌ర‌కు తాము తీసిన సినిమాల‌న్నింటినీ బంఫ‌ర్ హిట్లుగా నిలిపిన ద‌ర్శ‌కులు కొంద‌రున్నారు.ఒక్కొక్క‌రు ఒక్క పంథాలో ముందుకు వెళ్తూ విజ‌యాలు సాధిస్తున్న‌ ఆ సూప‌ర్ హిట్ డైరెక్ట‌ర్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం!

ఎస్ఎస్ రాజమౌళి

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కి తీసుకెళ్లాడు ఈ ద‌ర్శ‌క దిగ్గ‌జం.ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు తీసిని చిత్రాల‌న్నీ సూప‌ర్ హిట్లే.ప‌లు సినిమాలు స‌రికొత్త రికార్డులు సృష్టించిన‌వే.  స్టూడెంట్ నెం.1తో ప్రారంభ‌మైన రాజమౌలి ద‌ర్శ‌క‌ ప్రస్థానం బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఎదిగింది.సింహాద్రి, ఛత్రపతి, మగధీర, ఈగ, విక్రమార్కుడు,సై, మర్యాద రామన్న ఇలా ఆయ‌న తీసిన అన్ని సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి.

అనిల్ రావిపూడి

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రాజయం లేని యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.సాయి ధ‌ర‌మ్ తేజ్ సుప్రీమ్ సినిమా తో మొద‌లైన ఈయ‌న ప్ర‌స్తానం.క‌ల్యాణ్ రామ్‌తో ప‌టాస్ తీసి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.

Advertisement

ర‌వితేజ‌తో రాజా ది గ్రేట్ తీసి హ్యాట్రిక్ కొట్టాడు.ఆ త‌ర్వాత మ‌హేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా తీసి హిట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

కొరటాల శివ

ఒక‌ప్ప‌టి ఈ సినిమా ర‌చ‌యిత ఇప్పుడు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోతున్నాడు.మిర్చి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న‌.శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా మారాడు.

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా తీస్తున్నారు.

రాజ్ కుమార్ హిరాని

ప‌రాజ‌యాలు ఎరుగ‌ని బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ్ కుమ‌ర్ హిరాని.మున్నాబాయ్ ఎంబిబిఎస్ తో మొద‌లైన ఈయ‌న ప్ర‌యాణం.పికె, త్రీ ఇడియట్స్, సంజు సహా అన్ని విజ‌యాల‌నే సాధంచాడు.

వెట్రిమారన్

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఈయ‌న పేరు వింటేనే సాధించిన జాతీయ అవార్డులు గుర్తొస్తాయి.సామాజికి విష‌యాల‌పై ఎక్కువ సినిమాలు తీసే ఈయ‌న‌కు నాలుగు జాతీయ అవార్డులు వ‌చ్చాయి.ఇతడి దర్శకత్వంలో వచ్చిన విసరనై(విచారణ) మూవీ పోలీస్ స్టేష‌న్ ను చూస్తేనే వ‌ణుకు పుట్టేలా చేస్తుంది.

Advertisement

అనంత‌రం ధనుష్ హీరోగా వ‌చ్చిన‌ అసురన్ కు దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో వీరన్న పేరుతో వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిస్తున్నాడు.

అంజలి మీనన్

ఈ మల‌యాళి ద‌ర్శ‌కురాలు సైతం ఓట‌మి ఎరుగ‌రు.ఈమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అన్ని సినిమాలు సూప‌ర్ హిట్.త‌న డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన‌ బెంగళూర్ డేస్, కూడే, ఉస్తాద్ హోటల్.

ప్రతి సినిమా కూడా భాషతో సంబంధం బంఫ‌ర్ హిట్ అయ్యాయి.ఈమె సినిమాల ద్వారా ప‌లువురు మ‌ల‌యాళ న‌టులు ఇత‌ర భాష ప్రేక్ష‌కుల‌కు తెలిశారు.

తాజా వార్తలు