అల్లు అర్జున్ కి విలన్ గా టాలీవుడ్ హాట్ యాంకర్...  

Tollywood Anchor Anasuya Will Play Villain Role Allu Arjun Movie - Telugu Allu Arjun Movie News, Anasuya Allu Arjun Movie News, Anasuya Latest Movie News, Anasuya Movie Update, Anasuya News, Tollywood Actress Anasuya

ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్ అనసూయ బిజీ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతోంది.ఒకపక్క పలురకాల షోలు నిర్వహిస్తూనే మరో పక్క సినిమాల్లో నటిస్తోంది.

 Tollywood Anchor Anasuya Will Play Villain Role Allu Arjun Movie - Telugu News Latest Update Actress

ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు దాదాపుగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.ఇందులోభాగంగా ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న టువంటి ఓ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్నటువంటి మరో చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి లేడీ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.అయితే ఇందులో అసూయ ఓ కార్పొరేట్ కంపెనీ యజమాని పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఈ పాత్రకి  సంబంధించినటువంటి స్క్రిప్టు కూడా దర్శకుడు సుకుమార్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

తొందర్లోనే పలువురు సినీ పెద్దల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంచ్ చేసేందుకు దర్శకుడు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజులుగా అనసూయ సోషల్ మీడియా సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది.ఇందులో భాగంగా ఈ మధ్యనే తన ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ, అలాగే తనకు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.అంతేగాక తనపై ఇలాంటి వల్గర్ కామెంట్స్ లో చేసినటువంటి వారిని కచ్చితంగా అరెస్టు చేయిస్తానని కూడా తెలిపిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

Anasuya Allu Arjun Movie News,anasuya Latest Movie News,anasuya Movie Update,anasuya News,tollywood Actress Anasuya- Related....