Anasuya : 16ఏళ్ల వయసులో చేయాల్సిన సాంగ్ 32 ఏళ్ల వయసులో చేస్తున్నావా అనసూయ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనసూయ ( Anasuya ) ఒకరు.కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించినటువంటి ఈమె ఎప్పుడైతే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారో అప్పటినుంచి ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇలా జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో ఇక బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా సినిమా అవకాశాలు అందుకుంటూ వెండితెరకు పరిమితమయ్యారు.

ఇలా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఈమె ఓల్డ్ హీరోయిన్స్ గెటప్ వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే సావిత్రి ,జమున, సౌందర్య శ్రీదేవి వంటి హీరోయిన్ల గెటప్ వేసుకుని సోషల్ మీడియాలో ఈమె చేస్తున్నటువంటి హంగామా మామూలుగా లేదు.ఇక తాజాగా శ్రీదేవి ( Sridevi ) పదహారేళ్ళ వయసులో చేసిన సినిమాలోని సిరిమల్లె పువ్వా పాట ఎలాంటి ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.

అచ్చం శ్రీదేవి గెటప్ లోనే అనసూయ కూడా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈ పాటను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో పెట్టారు.

ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ( Social media ))వైరల్ గా మారింది.అచ్చం శ్రీదేవిని తలపిస్తూ అనసూయ ఎంతో అందంగా ఉందని కొందరి ఈ వీడియో పై కామెంట్ చేయగా మరికొందరు మాత్రం ఈ వీడియో పట్ల యధావిధిగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొంతమంది ఈ వీడియో పై స్పందిస్తూ అచ్చం శ్రీదేవి గారిలాగే ఉన్నారు మరోసారి శ్రీదేవిని గుర్తు చేశారు అనసూయ అంటూ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

మరికొందరు మాత్రం వీడియో పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీదేవి పదహారేళ్ళ వయసులో ఈ పాటకు ఎంతో అద్భుతంగా డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు.కానీ మీరు మాత్రం 16 రెండ్ల వయసులో ఈ పాట చేస్తున్నారు.ఇప్పుడు ఈ పాట చేయడం అవసరమా అంటూ అనసూయ వీడియోలపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఎప్పుడు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తే అనసూయ ఇలా కొత్తగా ఓల్డ్ హీరోయిన్స్ ను ట్రిబ్యూట్ చేస్తూ వారి గెటప్స్ లో సందడి చేయడంతో సోషల్ మీడియా మొత్తం అనసూయ ఈ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.అనసూయ ఏమి చేసిన అది ట్రెండ్ అవుతుందని మరోసారి నిరూపించుకున్నారు.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.ఈమె ప్రస్తుతం ప్రేమ విమానం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాతో పాటు రజాకర్, పుష్ప ( Pushpa )వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

త్వరలోనే ఈ సినిమాలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు