సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమ్ముడిగా టాలీవుడ్ యాక్షన్ హీరో...

టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న టువంటి హీరో గోపీచంద్ తొట్టెంపూడి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఎప్పుడు విభిన్న పాత్రలు ఎంచుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో గోపీచంద్ ఎప్పుడూ ముందుంటాడు.

అయితే ఇప్పటివరకు గోపీచంద్ కెరియర్ లో సరైన హిట్ లేక పోవడంతో గుర్తింపుకి కరువయ్యాడు.అయినప్పటికీ హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

అయితే తాజాగా గోపీచంద్ తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ గోపీచంద్ తో శౌర్యం, శంఖం వంటి చిత్రాలను తెరకెక్కించిన టువంటి దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండటంతో ఓ కీలక పాత్రలో గోపీచంద్ ని నటించమని దర్శకుడు శివ అడగడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ చిత్రానికి తెలుగులో అన్నయ్య అనే టైటిల్ కూడా పెట్టినట్లు సమాచారం.

Advertisement

అయితే ఇందులో గోపీచంద్ రజనీకాంత్ తమ్ముడుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం గోపీచంద్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సీటీ మార్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.అలాగే ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు