ఒలింపిక్ క్రీడలు వాయిదా... కరోనా ఎఫెక్ట్

కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన అన్ని రకాల కార్యక్రమాలని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఇప్పటికే క్రికెట్ టోర్నీలని ఆయా దేశాలు రద్దు చేసుకున్నాయి.

ఇక ఇప్పుడు ఊహించని విధంగా క్రీడాకారులు అందరికి చేదు వార్తని ఒలింపిక్ అసోసియేషన్ వినిపించింది.ఈ ఏడాది జపాన్ టోక్యోలో జులై నుంచి ప్రారంభం కావాల్సిన ఒలింపిక్స్ ని వాయిదా వేశారు.

మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ తెలిపింది.కరోనా ప్రభావం కారణంగా చాలా దేశాలు ఈ క్రీడలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించలేదు.

మరో వైపు ఈ కరోనా ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది తెలియడం లేదు.కరోనా ఎఫెక్ట్ దృష్ట్యా ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా గేమ్స్‌కి దూరం అయ్యాయి.

Advertisement

ఇక చాలా దేశాలు ఒలింపిక్ క్రీడలని వాయిదా వేయాలని కోరడంతో లిమ్పిక్స్ కమిటీ సమావేశం అయ్యి తమ నిర్ణయం మార్చుకుంది.మొన్నటిదాకా షెడ్యూల్ ప్రకారమే క్రీడల్ని నిర్వహిస్తామని మాటిమాటికీ చెప్పిన నిర్వాహకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

కరోనా అన్ని దేశాలలో విస్తరించి మృత్యు తాండవం చేస్తూ ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.షెడ్యూల్ ప్రకారమైతే టోక్యో ఒలింపిక్స్‌ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది.

కానీ కరోనా వైరస్ జపాన్‌తో పాటూ 195 దేశాల్లో విస్తరించింది.ఎక్కడికక్కడ లాక్ డౌన్లు ఉన్నాయి.

విమాన సర్వీసులు సరిగా లేవు.అందుకే ఈ క్రీడలు ప్రస్తుత షెడ్యూల్‌లో నిర్వహించడం కుదరదని భావించారు.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..

ఇక అథ్లెటిక్స్ ట్రైనింగ్ ని కూడా నిలిపెసినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు