నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

బీఆర్ఎస్ ,బిజెపి, కాంగ్రెస్ (BRS, BJP, Congress)ఇలా అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్(KCR) సైతం ఎన్నికల ప్రచారంలో తీవ్రంగానే శ్రమిస్తున్నారు.మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా చేసి, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల వద్ద తన పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక బిజెపి కూడా ఈ విషయంలో దూకుడుగానే ముందుకు వెళ్తోంది.

నిజామాబాద్ జిల్లాలో కేసిఆర్ పర్యటన 

Todays Election Campaign,kcrs Visit To Nizamabad District, Brs, Telangana Cm,

ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కెసిఆర్ పర్యటించనున్నారు.కమ్మరపల్లి, మోర్తాడ్, ఆర్మూర్(Kammarapalli, Mortad, Armour) రోడ్డు షో ద్వారా కేసీఆర్ నిజామాబాద్ రానున్నారు.సాయంత్రం నిజామాబాద్ లోని నెహ్రూ పార్క్ లో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.

Advertisement
Today's Election Campaign,KCR's Visit To Nizamabad District, Brs, Telangana Cm,

రాత్రి నిజామాబాద్ (Nizamabad)లో బస చేస్తారు.రేపు కామారెడ్డి జిల్లాలో బస్సు యాత్ర చేపట్టనున్నారు.

అదే రోజు సాయంత్రం కామారెడ్డి పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.ఆ తరువాత నగరంలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బెగాళ్ళ గణేష్ గుప్తా రోడ్ షో జరిగే కూడళ్లను పరిశీలించారు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.

రేవంత్ రెడ్డి పర్యటన 

Todays Election Campaign,kcrs Visit To Nizamabad District, Brs, Telangana Cm,

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను పార్టీ కార్యాలయం ప్రకటించింది.ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) రోడ్డు షో, కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రచారం చేస్తారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

రేపు ఉదయం 11 గంటలకు నరసాపూర్ జన జాతర సభలో సీఎం రేవంత్ (CM Revanth Reddy)పాల్గొని నీలం మధుకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.సాయంత్రం 6.30 గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.రాత్రి 7.45 గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్డు షో, కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు