లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ( Trinamool Congress Party Manifesto ) మ్యానిఫెస్టో విడుదల చేసింది.ఈ మేరకు మొత్తం పది ప్రధాన హమీలతో మ్యానిఫెస్టోను టీఎంసీ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి ( యూసీసీ) అమలు కాదని టీఎంసీ పేర్కొంది.నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ( ఎన్ఆర్సీ) ని నిలిపివేస్తామని తెలిపింది.
అదేవిధంగా ఉద్యోగాలకు భరోసా, ఉచిత ఎల్ పీజీ సిలెండర్ల( Free LPG Cylinders )తో పాటు యూనివర్సల్ హౌసింగ్ వంటి హామీలను మ్యానిఫెస్టోలో ప్రకటించింది.రైతులకు కనీస మద్ధతు ధర కల్పిస్తామన్న టీఎంసీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తామని పేర్కొంది.
ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య మౌలిక నిర్మాణాన్ని బీజేపీ నాశనం చేస్తోందని టీఎంసీ ఆరోపించింది.కాగా తొలి దశలో కూచ్ బెహర్, అలిపుర్ దౌర్, జలపాయ్ గురిలో పోలింగ్ జరగనుంది.







