సివిల్స్ ర్యాంక్ సాధించిన ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు, అవరోధాలు, ఇబ్బందులు ఉంటాయి.సివిల్స్ ఫలితాలు( Civils Results ) తాజాగా రిలీజ్ కాగా ఈ ఫలితాలలో సత్తా చాటిన వారిలో ఉదయ్ కృష్ణారెడ్డి( Uday Krishna Reddy ) ఒకరు.
సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉదయ్ యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసి ప్రశంసలు అందుకుంటున్నారు.ఐదేళ్ల వయస్సులో అమ్మను, ఇంటర్ చదివే సమయంలో నాన్నను కోల్పోయిన ఉదయ్ ను నాన్నమ్మ పెంచి పెద్ద చేసింది.
సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ రైతుకూలీ కుటుంబంలో జన్మించారు.ఉదయ్ కు ఒక సోదరుడు ఉండగా తండ్రి మరణం తర్వాత చదువు విషయంలో నాన్నమ్మ నుంచి అన్నాదమ్ములకు ప్రోత్సాహం లభించింది.
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే ఉదయ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి( Constable Job ) ఎంపికయ్యారు.ఉదయ్ నాన్నమ్మ అప్పటివరకు కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించింది.

కానిస్టేబుల్ జాబ్ సాధించిన ఉదయ్ ఆ తర్వాత సివిల్స్ పై( Civils ) దృష్టి పెట్టాడు.సీఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉదయ్ హైదరాబాద్ లో సివిల్స్ కోసం శిక్షణ తీసుకుని మూడు ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా నాలుగో ప్రయత్నంలో 780వ ర్యాంక్ తో మెరిశారు.ఉదయ్ లక్ష్యాన్ని సాధించడంతో తమ్ముడు ప్రణయ్ కూడా సివిల్స్ పై దృష్టి పెడతానని చెబుతున్నారు.

ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.ఉదయ్ కృష్ణారెడ్డి లక్ష్యాన్ని సాధించి రియల్ లైఫ్ లో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ఉదయ్ కృష్ణారెడ్డి ర్యాంక్ ను బట్టి అతను ఐ.
ఆర్.ఎస్ కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.సివిల్స్ లో మంచి ర్యాంక్ రావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఉదయ్ సక్సెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.







