కరోనా తర్వాత మొదటిసారి తిరుమలకు పోటెత్తిన జనం

నిత్యం రద్దీగా ఉండే తిరుమల స్వామివారి ఆలయం కరోనా కారణంగ ఆ మధ్య వెలవెలబోయింది.భక్తులు తిరుమల శ్రీవారి దర్శనంకు రావాలంటేనే కరోనాకు భయపడిపోయారు.

కరోనా నిబందనలను పాటిస్తూ దర్శనం కు వస్తున్న జనాలు కూడా అంతంత మాత్రమే, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి క్రమక్రమంగా తగ్గుతుంది.తిరుమలకు మునపటి వైభవం వచ్చేలాగా కనిపిస్తుంది.సోమవారం నాడు 37259 భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.16207 మంది తలనీలాలు సమర్పించారు.ఈ నెల 15న గోదాదేవి పరిణయోత్సవాలు, పార్వతి ఉత్సవం జరగబోతుందని తిరుమల ఆలయ అధికారులు వెల్లడించారు.

సంక్రాతి సెలవులు అవ్వడంతో మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని టి‌టి‌డి అధికారులు అంటున్నారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు