మొబైల్ చార్జింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

స్మార్ట్ ఫోన్ ఒక అత్యవసర వస్తువు అయిపోయింది.ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే దాంట్లో చార్జింగ్ తో ఉన్న బ్యాటరీ ఉండాల్సిందే కదా.

ఈ బ్యాటరీని చార్జింగ్ పెడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.అవేంటంటే " * బేసిగ్ గా మొబైల్ ని ఎప్పుడు చల్లగా ఉండే ప్రదేశాల్లోనే పెట్టాలి.

ఇక చార్జింగ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ తక్కువగా ఉండటం మరింత ముఖ్యం.* ఫోన్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టొద్దు.

హీట్ తగ్గాకే బ్యాటరీని చార్జ్ చేయాలి.* బ్యాటరీ మొత్తం వాడేసి, ఒకేసారి చార్జింగ్ అంతా నింపే బదులు, బ్యాటరీ ఓ 20-30% శాతం ఉండగానే చార్జింగ్ లో పెట్టడం సరైన పద్ధతి.

Advertisement

బ్యాటరీ ఎంత తక్కువగా ఉంటే, రేడియేషన్ అంత ఎక్కువ పెరిగే అవకాశమం ఉంటుంది.* చార్జింగ్ పెట్టేముందు ఆప్స్ అన్ని క్లోజ్ చేయడం మర్చిపోవద్దు.

కుదిరితే వైఫై ఆపేసి చార్జింగ్ పెట్టుకోవాలి.అలాగైతే త్వరగా చార్జ్ అవుతుంది మొబైల్.

* రాత్రిపూట్ చార్జింగ్ పెట్టేసి పడుకోవడం మంచి అలవాటు కాదు.చార్జింగ్ 100% నిండాక కూడా ప్లగ్ తీసేయకపోతే, బ్యాటరీ లాంగ్ రన్ డ్యూరేషన్ తగ్గిపోతూ ఉంటుంది.

* ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మీడియా ఫైల్స్ ప్లే చేయకూడదు.* గేమింగ్ మొబైల్ టెంపరేచర్ ని అమాంతం పెంచేస్తుంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

కాబట్టి చార్జింగ్ లో పెట్టి గేమ్స్ ఆడటం కాని, గేమ్ ఆడిన వెంటనే చార్జింగ్ పెట్టడం కాని చేయకూడదు.

Advertisement

తాజా వార్తలు