ఒంటిపై చీరలను తీసి మరి ఆ యువకులను కాపాడారు.. ఎవరో తెలుసా?

కరోనా కాలంలో ఇంటి మనిషినే పట్టించుకోని కాలం ఇది.భార్యకు కరోనా వచ్చిందని భర్త ఇంటి నుండి పారిపోయిన రోజులు ఇవి.

అలాంటి ఈ రోజుల్లో ముగ్గురు మహిళలు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.నీళ్లలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీరలను అందించి వారికి పునః జన్మనిచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.త‌మిళ‌నాడులోని పెరంబ‌ళూర్ జిల్లాలోని భారీ వర్షాల కారణంగా కొట్టారై డ్యామ్ నీటి మ‌ట్టం పెరిగింది.

అయితే ఆ గ్రామానికి చెందిన 12 మంది యువకులు ఆ డ్యామ్ కు సమీపంలో క్రికెట్ ఆడుతున్నారు.అనంతరం వారు ఆ డ్యామ్ లో స్నానం చేసేందుకు వెళ్లగా అక్కడున్న ముగ్గురు మహిళలు వారిని బయటకు రావాలని హెచ్చరించారు.

Advertisement

అయితే ఆ యువకులు వినలేదు.

ఇంతలో నలుగురు కుర్రాళ్ళు ప్ర‌మాద‌వ‌శాత్తూ డ్యామ్‌లో పడిపోయారు.ఇది గమనించిన ఆ ముగ్గురు మహిళలు వారిని రక్షించేందుకు అక్కడ ఏమి లేకపోవడంతో వారి చీరలను తీసి ఆ యువకులకు అందేలా చేశారు.

దీంతో ఇద్దరు కుర్రాళ్లు ప్రాణాలు కాపాడారు.కానీ దురదృష్టవశాత్తు మరో ఇద్దరు పిల్లలు చనిపోయారు.

ఏప్రిల్ 6 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు