కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఇసుక ట్రాక్టర్ ఓ బైకును ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ క్రమంలోనే మృతులు చిగురుమామిడి మండలం రామంచ వాసులుగా గుర్తించారు.
అనంతరం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.







