హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి..!!

ఈరోజు ఉదయం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు( Hyderabad Outer Ring Road ) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) సంభవించింది.

ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

సరిగ్గా ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట - కీసర మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు కిమీ 66 నెంబర్ ఎదురుగా జరిగింది.లారీ, టాటా ఏసీఈ, కారు ఢీ కొన్నాయి.

శామీర్ పేట - కీసర( Shamirpet - Keesara ) మధ్యలో లియోనియా రిసార్ట్( Leonia Resort ) వద్ద ఘట్ కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి డివైడర్ పైనుంచి ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం. కారుని ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లారీ పొదల్లోకి దూసుకెల్లగా.

Advertisement

ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు.మృతులలో లారీ డ్రైవర్ అదేవిధంగా బొలెరో వాహనంలోని ఇద్దరు ఉన్నారు.

దీంతో ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు