చేరికలు చేటు తెస్తాయా ? తూర్పు వైసీపీలో పరిస్థితి ఏంటి ?

ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు చేరికలపై దృష్టిపెట్టిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ, బీజేపీ బలపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ పార్టీలు జగన్ ప్రభుత్వంపై మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నా అవన్నీ ఎదుర్కొంటూనే పార్టీలో చేరికలపై జగన్ దృష్టిపెట్టారు.

ఫలితంగా చాలామంది టీడీపీ నాయకులు వైసీపీలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు.అయితే అయినా నాయకుల చేరికల విషయంలో తొందరపడకుండా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి, వారి చేరిక వల్ల భవిష్యత్తులో తమకు కలగబోయే ప్రయోజనాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ చేరికలు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ఇప్ప‌టికే విశాఖ జిల్లాకు చెందిన అడారి ఆనంద్ కుమార్‌, పిల్లా ర‌మాదేవి వైసీపీలో చేరిపోయారు.తాజాగా ఆదివారం తెలుగుదేశం పార్టీలో బ‌ల‌మైన నాయకుడిగా ఉన్నమాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు.

అయితే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్న ఇప్పుడు తోట త్రిమూర్తులు చేరికపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.

Advertisement

  తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్రాపురం నియోజకవర్గానికి చెందిన తోట చేరికపై ఇక్కడ గ్రూపు రాజకీయాలు మొదలయినట్టేనని తెలుస్తోంది.ప్రధానంగా అక్క‌డ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ వ‌ర్గంతో పాటు ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ వ‌ర్గాలు ఉన్నాయి.ఇక తోట వీళ్లిద్ద‌రి మీద ఎన్నిక‌ల్లో పోటీ చేశారు.

టీడీపీలో ఉన్న ఆయ‌న కూడా వైసీపీలోకి వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు వైసీపీలో ఆ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా ఏకంగా మూడు వ‌ర్గాలుగా మారినట్టు అర్ధం అవుతోంది.ఇప్పుడు ఈ మూడు గ్రూపులను ఏకం చేసి ముందుకు నడిపించాల్సిన బాద్యత మొత్తం జగన్ మీదే పడినట్టుగా అర్ధం అవుతోంది.

ఎందుకంటే వైసీపీ నాయకుల్లో చాలామంది తోట చేరికపై అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారు.అసలు తోట చేరికపై గుర్రుగా ఉన్న మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, చెల్లబోయిన వేణు వర్గాలు ఏకమై ఉమ్మడిగా సమావేశం నిర్వహించుకున్నట్టు సమాచారం.

ఇదే విషయమై స్వయంగా అధినేత జగన్ వద్ద పంచాయితీ పెట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నారట.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

  ఇక తోట ఇప్పుడు అధికార పార్టీ వైపు చూడడానికి కారణం ఉపముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కి భయపడే తోట వైఎస్ఆర్ సిపి లోకి వెళ్లాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే త్రిమూర్తులు, సుభాష్ చంద్రబోస్ ల మధ్య వైరం ఇప్పటిది కాదు.దాదాపు ముప్పై ఏళ్లుగా రామచంద్రపురం కేంద్రంగా వీరి మధ్య రాజకీయ వైరం ఉంది.

Advertisement

కాపు సామాజిక వర్గానికి చెందిన త్రిమూర్తులు వెంట ఆ వర్గం మొత్తం నడిస్తే, శెట్టి బలిజ సామాజిక వర్గం పిల్లి సుభాష్ చంద్రబోస్ కి అండగా ఉంటూ వస్తోంది.ఒక 10 ఏళ్లు రామచంద్రపురం నియోజకవర్గానికి తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఉంటే, ఆ తర్వాత ఒక పది ఏళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేసే విధంగా వైఎస్ఆర్సిపి పాలన ఉండవచ్చన్న అభిప్రాయాలు, పిల్లి సుభాష్ చంద్రబోస్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయంగా కక్ష సాధించే అవకాశం ఉందన్న ఊహాగానాలు తోట త్రిమూర్తుల్లో బలంగా ఉండడంతోనే ఆయన వైసీపీ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు