పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా నటించినటువంటి తొలిప్రేమ ( Tholiprema ) సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇదివరకు పవన్ కళ్యాణ్ కేవలం హీరోగా మాత్రమే ఉన్నారు.
కానీ తొలిప్రేమ సినిమా తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన స్టార్ హీరోగా మారిపోయారు.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమా విడుదల అయ్యి పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో తిరిగి ఈ చిత్రాన్ని శ్రీమాతా క్రియేషన్స్ వారు 4కె వెర్షన్ జూన్ 30వ తేదీ విడుదల చేశారు.అయితే ఈ సినిమా రీ రిలీజ్ లో అద్భుతమైన కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక ఈ సినిమాని 4కె వెర్షన్లు తిరిగి విడుదల చేయగా ఈ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ అన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి( Janasena Party ) విరాళంగా ప్రకటించబోతున్నట్లు శ్రీమాత క్రియేషన్స్ వారు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా తిరిగి విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి.ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా అన్నిచోట్ల హౌస్ ఫుల్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాకు కూడా హౌస్ ఫుల్ కావడం అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.ఇక ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి.తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రలో కూడా మంచిగా కలెక్షన్లను రాబట్టాయి.
ఈ సినిమా మొదటి రోజు ఏకంగా కోటి 23 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది.ఈ విధంగా సినిమా కూడా మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంతో పవన్ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా కలెక్షన్లు అన్నింటినీ కూడా జనసేనకు విరాళంగా ఇవ్వబోతున్న విషయం తెలిసింది.