ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల( Electric vehicles ) కొనుగోళ్లు పెరిగిపోయాయి.పెట్రోల్ ధరలు పెరగడం వల్ల చాలామంది ఇంధనంతో నడిచే బైక్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ ను భారీగా కొనుగోలు చేస్తుండటంతో.వాటికి బాగా డిమాండ్ పెరిగిపోయింది.
ఇటీవల మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ భారీగా పెరిగిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
వీటికి పెట్రోల్ ఖర్చు ఎక్కువగా ఉండదు.దీని వల్ల డబ్బులు చాలా ఆదా అవుతాయి.అంతేకాకుండా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల వరకు వస్తుంది.300 కిలోమీటర్ల వరకు వచ్చే బైక్ లో కూడా ఉన్నాయి.

ఇక ఎలక్ట్రిక్ బైక్ ల వల్ల మరో ఉపయోగం ఉంది.ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొన్నింటికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉండదు.రిజిస్ట్రేషన్ అవసరం లేని మోడళ్లు చాలా ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ( Central Motor Vehicle Rules )ప్రకారం 250 డబ్ల్యూ కన్నా తక్కువ పవర్ ఔట్‌ఫుట్ కలిగిన గంటకు 25 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ కలిగిన స్కూటర్లకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు.ఇలాంటి మోడల్ గల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి.అలాంటి బైక్ లhttps://telugustop.com/wp-content/uploads/2023/07/These-are-the-10-electric-scooters-that-do-not-require-registrationc.jpg గురించి తెలుసుకుందాం.
ఒకినావా లైట్ స్కూట్( Okinawa Light Scoot ) ధర రూ.66 వేలుగా ఉంది.ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు వెళుతుంది.ఇక కోమకి ఎక్స్‌జీటీ కేఎం మోడల్( XGT KM model ) బైక్ ధర రూ.57 వేలుగా ఉండగా.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.ఇక యాంపియర్ రియో ఎలైట్ స్కూటర్ ధర రూ.60 వేలుగా ఉండగా.దీని రేంజ్ 60 కిలోమీటర్లుగా ఉంది.హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఎల్‌ఎక్స్ ధర రూ.51 వేలుగా ఉంది.దీని రేంజ్ 85 కిలోమీటర్లుగా ఉంది.







