ఈ న్యాచురల్ సీరంను వాడితే హెయిర్ ఫాల్ తో పాటు చుండ్రు కూడా పరార్ అవుతుంది!

జుట్టు రాలడం మరియు చుండ్రు( dandruff ) .

మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే హెయిర్ సంబంధిత సమస్యల్లో ఇవి రెండు ముందు వరుసలో ఉంటాయి.

జుట్టు రాలడం మరియు చుండ్రు సమస్యలను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.ఖరీదైన హెయిర్ ఆయిల్, షాంపూ, కండీషనర్ తదితర ఉత్పత్తులను వాడుతుంటారు.

అయినా సరే ఫలితం లేకుంటే తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.కానీ వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం తో చాలా సులభంగా హెయిర్ ఫాల్ మరియు చుండ్రు సమస్యలను దూరం చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ హెయిర్ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ), రెండు టేబుల్ స్పూన్లు అల్లం( ginger ) తురుము వేసి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార‌ పెట్టుకోవాలి.

గోరు వెచ్చగా అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది సిద్ధం అవుతుంది.

ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సీరం ను వాడితే ఎటువంటి హెయిర్ ఫాల్ అయినా దెబ్బకు పరార్ అవుతుంది.

అలాగే తలలో చుండ్రు మొత్తం తొలగిపోతుంది.జుట్టు రాలడం మరియు చుండ్రు సమస్యలకు చెక్‌ పెట్టడానికి ఈ న్యాచురల్ సీరం చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

పైగా ఈ సీరం జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు