డార్క్ స్పాట్స్‌ను తొల‌గించి స్కిన్‌ను బ్రైట్‌గా మార్చే హోమ్ మేడ్ సోప్ ఇదే!

దాదాపు ప్ర‌తి ఒక్క‌రిని తీవ్రంగా మ‌ద‌న పెట్టే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో డార్క్ స్పాట్స్(న‌ల్ల మ‌చ్చ‌లు) ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

డార్క్ స్పాట్స్ చూసేందుకు అసహ్యంగా క‌నిపించ‌మే కాదు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

అందుకే వాటిని వ‌దిలించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ మేడ్ సోప్‌ను గ‌నుక వాడితే డార్క్ స్పాట్స్ తొల‌గిపోవ‌డ‌మే కాదు స్కిన్ బ్రైట్‌గా మ‌రియు గ్లోయింగ్‌గా కూడా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ సోప్ ను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, వ‌న్‌ టేబుల్ స్పూన్‌ కొబ్బ‌రి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక సోప్ బేస్‌ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా లేదా స‌న్న‌గా తురుముకుని పెట్టుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న‌ సోప్ బేస్ ముక్క‌ల‌ను వేయాలి.

Advertisement

చిన్న మంట‌పై సోప్ బేస్‌ను క‌రిగించాలి.పూర్తిగా క‌రిగిన త‌ర్వాత అందులో ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న తేనె- గ్లిజ‌రిన్‌- కొబ్బ‌రి నూనె మిశ్ర‌మం వేసి బాగా మిక్స్ చేసి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చిన్న ప్లాస్టిగ్ గిన్నెలో వేసి రెండు లేదా మూడు గంట‌ల పాటు వ‌దిలేస్తే న్యాచుర‌ల్ సోప్ సిద్ధం అవుతుంది.

మీరు వాడే రెగ్యుల‌ర్ సోప్‌కు బ‌దులుగా ఈ హోమ్ మేడ్ సోప్‌ను వాడితే డార్క్ స్పాట్స్ క్ర‌మంగా తొల‌గిపోతాయి.మీ స్కిన్ బ్రైట్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.అలాగే తేనెలో ఉండే ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు చ‌ర్మం యొక్క నిగారింపును పెంచుతాయి.

మొటిమ‌లు ద‌రి చేర‌కుండా అడ్డుక‌ట్ట వేస్తాయి.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ సోప్‌ను త‌యారు చేసుకుని వాడేందుకు ప్ర‌య‌త్నించండి.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు