లైఫ్ లో ఇదే తొలి అనుభవం.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్!

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి.

మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.నాని సరసన నటించిన భలే భలే మగాడివోయ్.

ఈమెకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చింది.అదే విధంగా నాగార్జున సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాల ద్వారా మంచి పాపు లారిటీ దక్కించుకున్న లావణ్య త్రిపాఠి గత ఏడాది చావు కబురు చల్లగా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.ప్రస్తుతం పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నా లావణ్య త్రిపాఠి ఈమధ్య సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

Advertisement

అయితే గత కొద్దిరోజుల నుంచి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించడంతో ఈమె రంగంలోకి దిగి ఆ వార్తలను కొట్టిపారేశారు.అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కలిసి రెండు సినిమాల్లో నటించారు.

ఈ రెండు సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడంతో వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.అదే విధంగా తమిళనాడుకు చెందిన లావణ్య అనే యువతి మరణించడంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా లావణ్య త్రిపాఠిని ట్రోల్ చేయడంతో తన గురించి ఆ విధంగా ట్రోల్ చేసిన వారికి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్న లావణ్య త్రిపాఠి తాజాగా మరోసారి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక ఆసక్తికరమైన ఫోటోని షేర్ చేశారు.ఈ సందర్భంగా ఆమె పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణం చేస్తూ అందరికన్నా తనే ముందుగా ఆ వాహనంలోకి ఎక్కినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన టికెట్.

ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ లైఫ్ లో అందరికన్నా ముందుగా రావడం ఇదే మొదటి అనుభవం అంటూ చెప్పుకొచ్చారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ విధంగా లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సినిమాల విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉంటూ పలు సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.ఈ విధంగా వృత్తిపరంగా బిజీగా ఉన్న లావణ్య సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు