ఐపీఎల్ హిస్టరీ లోనే ఫాస్టెస్ట్ బాల్ ఇదే.. అన్ని రికార్డులు బ్రేక్

ఐపీఎల్ 2022 లో సంచలనం నమోదయ్యింది.రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్​ 15వ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ జట్టు విజేతగా​ నిలిచింది.

అరంగేట్ర సీజన్ లోనే ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.ఎలాంటి అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చి చాంఫియన్‌గా అవతరించింది.

ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించి విజేతగా నిలిచింది.ఇక, ఈ మ్యాచులో కొన్ని రికార్డులు బద్దలయ్యాయ్.

ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ రికార్డును గుజరాత్ టైటాన్స్ పేసర్ ఫెర్గ్యూసన్ బద్దలు కొట్టాడు.ఐపీఎల్ ఫాస్టెస్ట్ బౌలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు ఉమ్రాన్ మాలిక్.

Advertisement

కానీ, ఇది ఫైనల్ మ్యాచ్‌కి ముందు.ఫైనల్‌లో ఓ కొత్త రికార్డు తెరపైకి వచ్చింది.

ఐపీఎల్ ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో లో అల్జెరీ జోసఫ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన లూకీ ఫెర్గ్యూసన్.ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్.ఈ సీజన్‌లో అత్యధిక ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.

సన్‌రైజర్స్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడితే.ఆడిన 14 మ్యాచ్‌లలోనూ ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డును ఉమ్రాన్ సొంతం చేసుకున్నాడు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

అంతేకాకుండా 157 kmph తో ఫైనల్ ముందు వరకు ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో టాప్‌లో నిలిచాడు.దీంతో ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది సీజన్’ కింద రూ.10 లక్షల చెక్కు, ఫర్గూసన్ ఖాతాలోకి వెళ్లనుంది.

Advertisement

అయితే, రాజస్థాన్, గుజరాత్ ఫైనల్ మ్యాచ్‌లో లోకీ ఫెర్గ్యూసన్ తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఉమ్రాన్ రికార్డును బ్రేక్ చేసి 157.3kmph తో బంతిని విసిరాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేగంతో బంతిని విసిరిన ఆటగాడిగా షాన్ టైట్ పేరిట ఉన్న ఈ రికార్డును లోకీ ఫెర్గ్యూసన్ సమం చేశాడు.

ఆ తర్వాతి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కొనసాగుతున్నాడు.

తాజా వార్తలు