తెలుగు సిని ఇండస్ట్రీకి చెందిన నటి సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది.ఇక సురేఖ వాణిప్రస్తుతం మాత్రం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
గత కొంత కాలం నుండి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఇక ఈమె ఇంత యాక్టివ్ గా కావడానికి కారణం తన కూతురు సుప్రీత అనే చెప్పాలి.తనెత్తు కూతురు గా ఉన్న సుప్రీతకు ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం కూడా లేదు.
కానీ తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.
ఈమె కూడా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక తన తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.
ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.
అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.
ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది. ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో కూడా సుప్రీత సోషల్ మీడియా వేదికగా ఫన్నీ వీడియో షేర్ చేసుకుంది.ఇక ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారటంతో నెటిజన్లు ఆ క్రియేటివిటీని అద్భుతంగా చూపించారు అని పొగిడారు.

ఇదిలా ఉంటే తాజాగా సుప్రీత తన ఇన్ స్టా లో ఒక వీడియో పంచుకుంది.అందులో అర్ధరాత్రి పున్నమి వేళ తన తల్లి సురేఖ వాణి తన పెట్ ను పట్టుకొని ఉయ్యాల ఊగుతూ కనిపించింది.ఇక సుప్రీత వీడియో తీస్తూ ఉంది.ఇక ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక సుప్రీత లేచింది మహిళా లోకం సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.