సాధారణంగా యాచకులను చూడగానే మన వద్ద ఉండే ఎంతో కొంత చిల్లర వేస్తుంటాం.జేబులో చిల్లర లేకుండా లేవని చెప్పి పంపించేస్తాం.
ఇలా అందరి వద్ద యాచించి, వచ్చిన ఆ డబ్బుతో ఆ యాచకులు కడుపు నింపుకుంటారు.లేదా ఎవరైనా ఇచ్చిన ఆహారాన్ని తిని సరిపెట్టుకుంటారు.
ఇలా వారి జీవితం గడుస్తుంటుంది.అయితే ఇటీవలో ఓ బిచ్చగాడు అందరికీ షాక్ ఇచ్చాడు.
మొదటగా పోలీసులు అవాక్కయితే, చివరికి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కూడా తెల్లబోయారు.ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హర్యానాలోని ఫరీదాబాద్ పోలీసులు ఇటీవల పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఓ యాచకుడు అనుమానాస్పదంగా తారసపడ్డాడు.అతడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం ఇచ్చాడు.దీంతో అతడి వద్ద ప్లాస్టిక్ సంచులపై పోలీసులకు అనుమానం వచ్చింది.తెల్లవారుజామున ఎక్కడికి వెళ్తున్నావంటూ అడిగితే ఆ యాచకుడు నీళ్లు నమిలాడు.
దీంతో అతడి చేతిలోని ప్లాస్టిక్ బ్యాగులను పోలీసులు పరిశీలించారు.వాటిని ఓపెన్ చేయగానే పోలీసులు కంగుతిన్నారు.అందులో కట్టకట్టలుగా రూ.50 లక్షల నగదు ఉండడం చూసి అవాక్కయ్యారు.పోలీసులు అతనిని డబ్బు గురించి అడిగారు.కానీ ఆ యాచకుడు సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు.వెంటనే పెట్రోలింగ్ పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు.విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
ఈ సమాచారాన్ని వెంటనే వారు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు తెలిపారు.వారు వచ్చి ఆ రూ.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.అంత డబ్బు ఎలా వచ్చిందా అని యాచకుడిని విచారిస్తున్నారు.
అయితే విచారణలో ఏ మాత్రం ఆ యాచకుడు సహకరించలేదు.ఈ వార్త ఆ ప్రాంతంలో దావానలంలా పాకింది.దీంతో బిచ్చగాడి వద్ద రూ.50 లక్షలు ఉన్న విషయం తెలుసుకుని స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు.







