ఇది మామ్మూలు బైక్ కాదండోయ్... లోపలుంటే ఇన్వెర్టర్, బయటికెళితే స్కూటర్!

అవును, ఇది మామ్మూలు బైక్ కాదు.మీరు ఫోల్డబుల్ సైకిల్( Foldable bicycle ) గురించి విని వుంటారు కానీ, బైక్స్ గురించి పెద్దగా విని వుండరు.

ఇపుడు అలాంటి ఓ బైక్ గురించే ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం.1981లో హీరో హోండా నుంచి సరిగ్గా కారు డిక్కీలో పట్టేంత ఓ ఫోల్డబుల్ బైక్ మార్కెట్లోకి వచ్చింది.దాని పేరు మోటోకాంపో( Motocampo ).అప్పుడు కొన్ని అనివార్య కారణాలు, ప్రతికూలతల కారణంగా ఆ బైక్ ఉత్పత్తిని 1983లోనే నిలిపివేశారు.అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్ ని వాడుకొని చైనీస్ మోటార్ సైకిల్ తయారీదారైన ఫెలో ఓ కొత్త ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్( Foldable electric scooter ) ని ఆవిష్కరించింది.

ఈ నేపథ్యంలో ఫెలో టూ ఎం వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరిట దీనిని టోక్యో మోటార్ షో లో ప్రదర్శించింది.మన ఊహలకు స్వరూపం ఇస్తే ఎలా ఉంటుందో ఈ బైక్ అచ్చం అలాగే ఉండడం కొసమెరుపు.చాలా చిన్న సైజ్ లో ఉండే ఈ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ బైక్ బరువు కేవలం 37 కేజీలు మాత్రమే.

దీనిలో 1000 వాట్స్ పీక్ రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఫిట్ చేసారు.అంతేకాకుండా 48V, 20Ah బ్యాటరీ ఒక kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలుతుంది.

అయితే దీనితో వేగంగా ప్రయాణించాలంటే కాస్త కష్టమనే చెప్పుకోవాలి.సిటీ పరిధిలో కేవలం 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో మాత్రమే దీనిని డ్రైవ్ చేయగలము.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మరో ఆసక్తికర ఫీచర్ ఏంటంటే వీ2ఎల్( వెహికల్ టూ లోడ్).

Advertisement

దీని ద్వారా మీ ఇంట్లోని వస్తువులు ఈ బైక్ లోని బ్యాటరీ ద్వారా ఆన్ చేసుకొని ఎంచక్కా వాడేసుకోవచ్చు.ఈ ఎం వన్ స్కూటర్ ప్రస్తుతం చైనా తో పాటు జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.

నాలుగో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.దీని ప్రారంభ ధర 2,900 అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2,38,710 ఉండే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు