తినేప్పుడు కూడా కిరీటం తీయని బాలకృష్ణ .. ఎంత డెడికేషన్

సింగీతం శ్రీనివాసరావు.తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు.

ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా, అసోసియేట్ దర్శకుడా పని చేసి దర్శకుడిగా ఎదిగాడు సింగీతం.

పుష్పక విమానం సినిమాతో దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు.

ఈ సినిమా ద్వారా తన దర్శకత్వ ప్రతిభ ఎలాంటితో చలనచిత్ర రంగానికి తెలిసి వచ్చేలా చేశాడు.ఎన్టీఆర్ కు చెందిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

కానీ దర్శకత్వం వహించలేదు.బాలయ్య సినిమాలకు మాత్రం దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.

Advertisement

ఎన్టీఆర్ నట వారసుడితో మూడు సినిమాలు చేశాడు.వాటిలో రెండు సినిమాలు క్లాసికల్ మూవీస్ గా నిలిచిపోయాయి.

వాటిలో ఒకటి ఆదిత్య 369 కాగా మరొకటి భైరవద్వీపం.ఎన్టీఆర్ మాదిరిగానే బాలయ్య కూడా నటించడంలో గొప్ప ప్రతిభ కనబర్చగడని నమ్మాడు సింగీతం శ్రీనివాస్.

పెద్దవారిని గౌరవించడం, క్రమశిక్షణలో తనకు తానే సాటి అని చెప్పేవాడు.పౌరాణిక సినిమాలు చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వేస్ట్ చేసేవాడు కాదు.

ఒక్కసారి వేషం వేసుకుంటే ఆభరణాలను కూడా తీసేవాడు కాదు.లంచ్ టైంలో కూడా సమయం వ్రుథా అవుతుందని కిరీటం సహా ఆభరణాలు అలాగే ఉంచుకునే వాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

ఆ లక్షణం సింగీతం శ్రీనివాస్ కు చాలా నచ్చేదట.

Advertisement

ఆదిత్య 369 సినిమాలో శ్రీ‌కృష్ణ‌ దేవ‌రాయ‌లు క్యారెక్టర్ చేస్తున్న సమయంలో తలమీద కిరీటం ఇబ్బంది కలిగిస్తున్నా అలాగే ఉండేవాడట.అటు ఈ సినిమా భవిష్యత్ సీన్లు షూట్ చేసే సమయంలో చాలా సమయం వేస్ట్ అయ్యేది.అందుకే బాలయ్యను కాస్త లేటుగా రావాలని చెప్పాడు.

అయితే ఇంటి దగ్గరే ఉన్న బాలయ్యను చూసి ఎన్టీఆర్.ఈ రోజు షూటింగ్ లేదా? అన్నాడట.అయితే సింగీతం గారు తనను లేటుగా రమ్మని చెప్పినట్లు వెల్లడించాడు.

అయితే నిర్మాత మనకు డబ్బు ఇచ్చేది ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండడానికే.వెంటనే మేకప్ వేసుకుని వెళ్లాలని ఆదేశించాడట.

ఎన్టీఆర్ మాటతో వెంటనే తను షూటింగ్ దగ్గరికి వెళ్లాడట.

తాజా వార్తలు