బాడీని క్లీన్ చేసే సూప‌ర్ డ్రింక్ ఇది.. రోజు తాగితే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

బాడీ క్లీన్‌గా ఉండాలంటే రోజుకు రెండు సార్లు స్నానం చేస్తే స‌రిపోదు.ఎప్ప‌టిక‌ప్పుడు శ‌రీరంలోని అంతర్గత భాగాలను సైతం శుభ్ర‌ప‌రుచుకోవాలి.

అందుకోసం మీరేమి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం కూడా లేదు.ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ డ్రింక్‌ను డైలీ డైట్ లో చేర్చుకుంటే మీ బాడీ క్లీన్‌గా మార‌డం ఖాయం.

పైగా ఈ డ్రింక్ ద్వారా మ‌రెన్నో హెల్త్ బెనిఫిట్స్ సైతం త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బాడీని డిటాక్స్ చేసే ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ ను పోయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వ‌గానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ సోంపు వేసి రెండు నిమిషాల పాటు మ‌రిగించాలి.

Advertisement

ఆ త‌ర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ క‌లోంజి సీడ్స్ పౌడ‌ర్‌, నాలుగు దంచిన మిరియాలు, ఒక జాప‌త్రి, పావు స్పూన్ ప‌సుపు వేసుకుని ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.ఆపై స్ట్రైన‌ర్ సాయంతో వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేస్తే బాడీని క్లీన్ చేసే సూప‌ర్ డ్రింక్ సిద్ధ‌మైన‌ట్లే.

ఈ డ్రింక్ గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే తాగేయాలి.ప్ర‌తి రోజు ఈ డ్రింక్ ను ఉద‌యం స‌మ‌యంలో తీసుకుంటే శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలు తొలగిపోతాయి.

బాడీ శుభ్రంగా మారుతుంది.

అంతేకాదండోయ్‌.ఈ డ్రింక్ ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా ప‌ని చేస్తుంది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

జ్ఞాప‌క శ‌క్తి, ఆలోచ‌న శ‌క్తి రెట్టింపు అవుతాయి.ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

Advertisement

మ‌రియు బ‌రువు కూడా త‌గ్గుతారు.

తాజా వార్తలు