టెక్సాస్ కి చెందినా ఓ తండ్రి ఘోరమైన చర్య ఇది...!!!

కోపం ఎన్నో అనర్దాలకి దారితీస్తుంది అంటారు.కానీ కొడుకునే పోట్టనపెట్టుకునేలా కోపం ఉంటుందని ఎవరూ ఊహించరు.

టెక్సాస్ కి చెందిన ఓ తండ్రి తన ఎనిమిది నెలల కొడుకుపై కోపంతో ఆ పసివాణ్ణి కొట్టి చంపేశాడు.ఈ విషయం బయటపడితే తనకి ప్రమాదమని భావించిన ఆ తండ్రి ఏకంగా కొడుకుని ఓ బ్యాగ్ లో కుక్కి ఊరికి దూరంగా ఉండే పోలాలమధ్య పడేశాడు.

అయితే ఎంతో తెలివిగా అతడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కొడుకు కన్పించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు.అయితే స్థానికులు ఆ బ్యాగ్ ని చూసి బాంబు ఉందనుకుని పోలీసులకి సంచారం అందించగా ఘటన స్థలానికి వచ్చిన పోలీసులో అందులో పిల్లాడి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు.

పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయట పడటంతో నిందితుడు అయిన ఆ బిడ్డ తండ్రి క్రిస్టోఫర్ డావిలాను అరెస్ట్ చేశారు.ఈ చర్యకు తనతో పాటు సహకరించిన అతడి తల్లి, చెల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే క్రిస్టోఫర్ ఎందుకు తన బిడ్డని చంపాలని అనుకున్నాడో ఇంకా తెలియరాలేదు.

Advertisement
ఇల్లు మారేటప్పుడు సౌత్ కొరియర్లు వస్తువులు ఎలా తరలిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Advertisement

తాజా వార్తలు