న్యూజిలాండ్ ఘటన నిందితుడిపై 50 మర్డర్ కేసులు..!!!

ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ఘటన న్యూజిల్యాండ్ లోని క్రైస్ట్‌ చర్చ్ లో జరిగిన కాల్పుల ఘటన.ఈ ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు.

 50 Murder Cases On New Zealand Culprit-TeluguStop.com

ఫేస్బుక్ లో లైవ్ పెట్టి మరీ రెండు మసీదులోకి చొరబడి కాల్పులు జరిపి 50 మంది ప్రాణాలను బలిగొన్న ఆ వ్యక్తిని ఎవరూ మర్చిపోరు.అయితే

ఈ ఘటన తాలూకు నిందితుడు బెన్ర్‌టోన్‌ టరెంట్‌ 50 హత్యాభియోగాలను ఎదుర్కోనున్నాడని పోలీసులు తెలిపారు.

వీటితో పాటు మరో 39 హత్యాప్రయత్నం అభియోగాలను శుక్రవారం కోర్టులో హాజరుపరిచే సమయంలో ఎదుర్కొనున్నాడని వెల్లడించారు.

ఈ నిందితుడు జాతి విద్వేషం కారణంగా ఈ హత్యలకి పాల్పడ్డాడు.అయితే ఈ దాడి తరువాత కేవలం అతడిపై ఒక హత్యకి సంబంధించిన అభియోగాలు మాత్రమే నమోదయ్యాయి.ఇదిలాఉంటే క్రైస్ట్‌ చర్చ్ లోని హైకోర్టు ఎదుట అతడిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు పరుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube