Hair Breakage : జుట్టు విపరీతంగా ముక్కలవుతుందా.. ఈ హెయిర్ టానిక్ తో ఈజీగా చెక్ పెట్టేయండి!

జుట్టు ముక్కలు అవ్వడం.( Hair Breakage ) ఈ సమస్యతో సతమతం అవుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు.

సరైన పోషణ అందకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.దీంతో చీటికిమాటికి జుట్టు ముక్కలు అయిపోతూ ఉంటుంది.

ఈ సమస్య కారణంగా జుట్టును దువ్వాలంటేనే భయపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ను( Home Made Hair Tonic ) మీరు కచ్చితంగా వాడాల్సిందే.ఈ టానిక్ హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది.

జుట్టు మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక కలబంద ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను( Aloevera Gel ) సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో ఆ కలబంద జెల్ ను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె,( Mustard Oil ) వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) మరియు నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

ఈ టానిక్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.ఆపై కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు స్కాల్ప్ ను( Scalp ) మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడారంటే అనేక బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

మూలాల నుంచి జుట్టును బలోపేతం చేయడానికి ఈ హెయిర్ టానిక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ టానిక్ ను వాడటం వల్ల బలహీనమైన కురులు బలంగా మారతాయి.దాంతో జుట్టు ముక్కలవడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.

Advertisement

కాబట్టి త‌మ జుట్టు విపరీతంగా ముక్కలు అవుతుంది అని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ టానిక్ ను వాడండి.పైగా ఈ టానిక్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.చుండ్రు సమస్య సైతం దూరం అవుతుంది.

తాజా వార్తలు