ఒకే ఒక జీవితం సినిమాను రిజెక్ట్ చేసి ఫీలవుతున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?

ఈ నెల 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఒకే ఒక జీవితం సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.వీక్ డేస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయని బోగట్టా.

 This Hero Rejected Oke Oka Jeevitham Movie Details Here Goes Viral ,oke Oka Jee-TeluguStop.com

కేవలం 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.ఈ సినిమాతో శ్రీ కార్తీక్ అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

ఈ దర్శకుడు కొత్త దర్శకుడు కావడం వల్లే పెద్దగా అంచనాలు లేకుండా ఒకే ఒక జీవితం సినిమా థియేటర్లలో విడుదలైంది.అయితే ఈ సినిమాను రిజక్ట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ అని తెలుస్తోంది.

చాలా సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నోటా సినిమాలో నటించారు.తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Telugu Amala, Ritu Varma, Sharawanadh, Sree Karthik, Vennela Kishore-Movie

ఈ సినిమా ఫలితం వల్ల తమిళ దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో ఒకే ఒక జీవితం సినిమాలో నటించడానికి విజయ్ దేవరకొండ ఆసక్తి చూపలేదు.ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ కచ్చితంగా మరింత పెరిగి ఉండేదని చెప్పవచ్చు.అయితే శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటించాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నారని తెలుస్తోంది.త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.అల్లు అర్జున్ కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసిన ఈ డైరెక్టర్ విజయ్ దేవరకొండ కోసం కూడా ఎలాంటి కథను సిద్ధం చేస్తారో చూడాల్సి ఉంది.

ఇతర డైరెక్టర్ల కథలకు భిన్నమైన కథలను తయారు చేయడం ద్వారా ఈ డైరెక్టర్ వార్తల్లో నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube