ఒకే ఒక జీవితం సినిమాను రిజెక్ట్ చేసి ఫీలవుతున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?

ఈ నెల 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఒకే ఒక జీవితం సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

వీక్ డేస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయని బోగట్టా.

కేవలం 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఈ సినిమాతో శ్రీ కార్తీక్ అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయమయ్యారు.ఈ దర్శకుడు కొత్త దర్శకుడు కావడం వల్లే పెద్దగా అంచనాలు లేకుండా ఒకే ఒక జీవితం సినిమా థియేటర్లలో విడుదలైంది.

అయితే ఈ సినిమాను రిజక్ట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ అని తెలుస్తోంది.

చాలా సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నోటా సినిమాలో నటించారు.

తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

"""/" / ఈ సినిమా ఫలితం వల్ల తమిళ దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో ఒకే ఒక జీవితం సినిమాలో నటించడానికి విజయ్ దేవరకొండ ఆసక్తి చూపలేదు.

ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ కచ్చితంగా మరింత పెరిగి ఉండేదని చెప్పవచ్చు.

అయితే శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటించాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నారని తెలుస్తోంది.

త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.అల్లు అర్జున్ కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసిన ఈ డైరెక్టర్ విజయ్ దేవరకొండ కోసం కూడా ఎలాంటి కథను సిద్ధం చేస్తారో చూడాల్సి ఉంది.

ఇతర డైరెక్టర్ల కథలకు భిన్నమైన కథలను తయారు చేయడం ద్వారా ఈ డైరెక్టర్ వార్తల్లో నిలుస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా వచ్చారు…వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరా..?