వైరల్ వీడియో: అరెరే.. ఈ చింపాంజీ ఏంటబ్బా బట్టలు ఇలా ఉతికేస్తోంది..?!

ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ గా మారాయి.అవి చేసే పనులు చూస్తుంటే ఒక్కోసారి నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది.

 This Chimpanzee Is Washing Clothes Like This ..?! Viral Latest, Viral News, Vira-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చింపాంజీకి సంబందించిన ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో చింపాంజీ చేసిన పని చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు.

జంతువుల్లో కెల్లా చింపాంజీలు బాగా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాయి.కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి అచ్చం మనుషుల వలే ప్రవర్తిస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

నిజానికి కొన్ని పరిశోధనల్లో మనుషులకు అలాగే చింపాంజీలకు సిమిలారిటీ కూడా ఉందని తేలింది.

అందుకే అవి మనుషులు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని గమనించి అచ్చం అలాగే చేసేస్తుంటాయి.

కాగా చింపాంజీలు మనుషులతో కూడా ఇట్టే కలిసిపోతాయి.ఈ క్రమంలోనే ఒక చింపాంజీ అచ్చం మనుషులు ఎలాగయితే బట్టలు వాష్ చేస్తారో సేమ్ అలాగే అది కూడా బట్టలు ఉతుకుతూ కనిపించగా కొందరు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో చింపాంజీ అచ్చం మనిషిలాగే కూర్చుని ఒక పసుపు రంగు టీ షర్ట్ ను రాయిపై వేసి, దానికి సబ్బు కూడా పెట్టి తరువాత ఆ షర్ట్ ను బ్రష్ తో శుభ్రం చేయడం మనం గమనించవచ్చు.అచ్చం మనుషులు ఎలాగయితే బట్టలు ఉతుకుతారో అలాగే చింపాంజీ బట్టలు ఉతకడం చూసి అందరు షాక్ అవుతున్నారు.మనుషుల వలే భలే బట్టలు ఉతుకుతుందే అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కొందరయితే చింపాంజీలు ఇలాగే బట్టలు ఉతకడం నేర్చుకుంటే అందరు కూడా వాళ్ళ ఇళ్లల్లో చింపాంజీలను పెంచుకుంటారేమోని మరి కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube