కీలకమైన విశాఖ కార్పొరేషన్‌ను గెలుచుకోవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.ఏకంగా దశాబ్దాల పాటు టీడీపీ కల నెరవేరడం లేదు.
చంద్రబాబుసీఎంగా నాడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలినప్పుడు కూడా ఇక్కడ మేయర్ పీఠం టీడీపీ గెలుచుకోలేదు.పార్టీ చరిత్రలో ఒకే ఒకసారి టీడీపీ విశాఖ మేయర్ పీఠం గెలిచింది.1983లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1987లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది.అపుడు విశాఖ మేయర్ గా టీడీపీకి చెందిన ప్రముఖ న్యాయవాది డీవీ సుబ్బారావు నెగ్గారు.ఆ తర్వాత విశాఖ మేయర్ పీఠం ఎప్పుడూ టీడీపీ గెలవలేదు.
1994లో ఎన్టీయార్ నాయకత్వాన టీడీపీ బంపర్ మెజారిటీతో నెగ్గింది.మూడు నెలలు తిరగకుండానే 1995 ఫిబ్రవరిలో విశాఖ మేయర్ ఎన్నికలు పెడితే టీడీపీ చిత్తుగా ఓడింది.నాడు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది.ఆ తర్వాత చంద్రబాబు వరుసగా రెండోసారి 1999లో అధికారంలోకి వచ్చాక 2000లో మళ్లీ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ విశాఖ మేయర్ పీఠంలో టీడీపీ ఓడి కాంగ్రెస్ గెలిచింది.ఇక 2007లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖ మేయర్ ఎన్నికలు జరగగా అప్పుడు కూడా కొందరు కాంగ్రెస్ రెబల్స్ సాయంతో మళ్లీ విశాఖ మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది.

ఇక ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖ మేయర్ పీఠానికి ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే.టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.మొత్తం 98 వార్డులను తమకు అనుకూలంగా డిజైన్ చేసుకున్నారని ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తోంది.జీవీఎంసీ పరిధిలో టీడీపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచినా అందులో ఒకరు పార్టీకి దూరమయ్యారు.గంటా యాక్టివ్‌గా లేరు.
ఇన్నీ వ్యతిరేకత నేపథ్యంలో ఈ సారి అయినా టీడీపీ విశాఖ మేయర్ పీఠంపై పార్టీ జెండా ఎగర వేస్తుందా ? అన్నది చూడాలి.