గత కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఎన్నో కీలక రాజకీయ పరిణామాలు చేసుకుంటూ వస్తున్నాయి.
ముఖ్యంగా అధికార పార్టీ వైసిపిని ఇరుకున పెట్టే ఆయుధాలు ఎన్నో టిడిపికి దొరికాయి.అసెంబ్లీలోనూ, బయట వైసీపీ ని టార్గెట్ గా చేసుకుని టిడిపి అనేక వ్యూహాలను అమలు చేస్తోంది.
ఇటువంటి కీలక సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సైలెంట్ అవ్వడం, క్షేత్ర స్థాయిలో కి వచ్చి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసే అవకాశం ఉన్నా, బాబు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు.దీంతో అసలు ఏం జరుగుతోంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం అర్థం కాని పరిస్థితి.
వైసీపీ మంత్రులు అదేపనిగా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండడంతోనే, ఆ అవమానాన్ని తట్టుకోలేక బాబు ఈ విధంగా మౌన ముద్ర లోకి వెళ్లిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ లోనూ, శాసనమండలిలోనూ టిడిపి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడుతున్నా, టిడిపి సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోయినా బాబు మాత్రం దీనిపై స్పందించడం లేదు.
అసలు అజ్ఞాతంలోకి ఆయన ఎందుకు వెళ్లారు అనేది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.వాస్తవంగా చంద్రబాబు ఎప్పుడు ప్రజలతో ఉండేందుకు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఇష్టపడతారు.
తరుచుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాచరణను ప్రకటించడం తో పాటు, తమ రాజకీయ ప్రత్యర్ధులను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తూ ఉంటారు.కానీ గత కొద్ది రోజులుగా ఆ తరహా వ్యవహారం చోటు చేసుకోకపోవడంతో సొంత పార్టీ నాయకులు అభిమానుల్లో అనేక సందేహాలు బయలుదేరాయి.

అయితే బాబు సైలెంట్ అవ్వడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయట.ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీ చాలా బలంగా ఉంది.రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన అన్ని రాజకీయ వ్యూహాలను రచిస్తోంది.దీనికితోడు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బయటకు రావడం లేదు.
అప్పుడప్పుడు మాత్రమే ముఖ్యమైన కార్యక్రమాలకు బయటకు వస్తున్నారు తప్పించి , ఎక్కువగా కార్యాలయానికి పరిమితమవుతున్నాయి అక్కడినుంచి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ ఆలోచిస్తూ 2024 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి అవసరమైన రాజకీయ వ్యూహాలను ఉన్నారట అలాగే రాబోయే ఎన్నికల్లో పొత్తులు కీలకం కాబోతూ ఉండడం తో జనసేన బీజేపీ తమ తో కలిస్తే వాటికి సీట్ల కేటాయింపు ఏవిధంగా చేయాలి ? ఆయా పార్టీల బలాబలాలు ఎంత ? ఇలా అనేక అంశాలపై సమగ్రంగా విశ్లేషణ చేస్తున్నట్లు సమాచారం.ముఖ్యంగా జనసేన తమతో పొత్తు పెట్టుకునేందుకు సముఖంగా ఉన్నా, బిజెపి దానిని వ్యతిరేకిస్తుండడంతో బిజెపి అగ్రనేతలను ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అనే అంశం పైన చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అందుకే ప్రస్తుతానికి కొద్ది రోజులపాటు అజ్ఞాతంలో ఉన్నా, అంతిమంగా టిడిపి విజయానికి ఏం చేయాలి అనే అంశం పైనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు సమాచారం.బాబు అజ్ఞతానికి కారణాలు కూడా ఇవెనట
.






