మ‌గ‌వారు లేని టైమ్ చూసి ఇంట్లోకి చొర‌బ‌డ్డ దొంగ‌లు.. చివ‌ర‌కు

ఈ మ‌ధ్య దొంగ‌లు, దోపిడీ దారుల ఆగ‌డాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.వారు చేస్తున్న ప‌నులు అత్యంత క్రూరంగా ఉంటున్నాయి.

డ‌బ్బు కోసం చివ‌ర‌కు ప్రాణాలు కూడా తీస్తున్నారు.ఒక‌ప్పుడు దొంగ‌లు ఏ రాత్రి పూట‌నో వ‌చ్చేవారు.

కానీ ఇప్పుడు అలా కాకుండా మ‌ధ్యాహ్న స‌మ‌యంలోనే వ‌చ్చి అందిన కాడికి దోచుకుని పోతున్నారు.ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో చాలా వ‌ర‌కు విషాదాంత క‌థ‌లే వినిపిస్తున్నాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి అరుదైన ఘ‌ట‌న ఒక‌టి చోటుచేసుకుంది.ఈ వార్త అంద‌రినీ క‌లిచి వేస్తోంది.

Advertisement

మ‌న ప‌క్క రాష్ట్రం తమిళనాడులోని కాంచీపురం సిటీలో సినిమా త‌ర‌హాలో ఓ దొంగతనం జ‌రిగింది.ఓ మేఘనాథన్ అనే ప్ర‌భుత్వ అధికారి ఫ్యామిలీతో క‌లిసి మారుతీనగర్‌లో జీవిస్తున్నాడు.

కాగా అన్న‌ద‌మ్ములంతా ఉమ్మ‌డి కుటుంబం లాగే ఒకే ఇంట్లో ఉంటున్నారు.అయితే మేఘ‌నాథ‌న్ తో పాటు అత‌ని త‌మ్ముళ్లు శ్రీనివాసన్ అలాగే మణికందన్ కూడా త‌మ ప‌నులకు వెళ్లిపోయారు.

ఇక ఈ అన్న‌ద‌మ్ముల భార్య‌లు ముగ్గురూ ఇంట్లోనే టీవీ చూస్తూ ఉన్నారు.కాగా మధ్యాహ్నం 2 గంటలకు కొంద‌రు దొంగ‌లు ఇంట్లోకి చొర‌బ‌డ్డారు.

కాగా వారిని క‌త్తులు చూపించి బెదిరించారు.భ‌యంతో ఆ తోడికోడళ్లు సైలెంట్ అయిపోయారు.ఇక అందిన కాడికి వారి ఒంటి మీద ఉన్న బంగారంతో స‌హా మొత్తం దోచుకున్నారు దొంగ‌లు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

అయితే కేసు విచార‌ణ‌లో త‌లుపులు తెరిచి ఉండ‌టం వ‌ల్లే వారు లోప‌ల‌కు వ‌చ్చిన‌ట్టు పోలీసులు అంచ‌నా వేస్తున్నారు.దొంగ‌లు ఎప్ప‌టి నుంచో ఆ ఇంటిని రెక్కీ చేస్తున్నార‌ని, మ‌గ‌వారు లేని స‌మ‌యం చూసి ఇంట్లోకి చొర‌బ‌డ్డార‌ని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

Advertisement

కాగా వారిని ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు.ఈ వార్త నెట్టింట్లో చెక్క‌ర్లు కొడుతోంది.మ‌హిళ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు