వీళ్లు ఒక క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తారు...

ఒక సినిమా చేయడానికి ఒక హీరో చాలా రకాలుగా కష్ట పడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ సినిమా లో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ లో తను మంచిగా కనబడటానికి ఆయన చాలా రకాలుగా తన బాడీ ని మార్చుకోవాల్సి ఉంటుంది.

నిజానికి ఒక సినిమాలో వాళ్ల క్యారెక్టర్ ఎలా ఉంటే జనాలకి నచ్చుతుంది అనేది ఒక డైరెక్టర్ ఊహించుకొని దాన్ని హీరోల చేత చేయిస్తాడు అందుకే సినిమా హీరోలు అంటే జనాలకి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది.

కొన్ని సార్లు అయితే వాళ్ళు అనుకున్న బాడీ రావడానికి నానా రకాల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అంత పిచ్చి ఉంటుంది కాబట్టే ఇక్కడ హీరోలుగా వాళ్ళు నిలబడ గలుగుతారు.ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన సౌత్ సినిమాల్లో బాగా కష్టపడి బాడీ ని హూనం చేసుకొని ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసేవాళ్ళలో తమిళ్ కి చెందిన కమల్ హాసన్, విక్రమ్( Kamal Haasan Vikram ) ఇద్దరు కూడా ముందు వరసలో ఉంటారు.వాళ్ల బాడీ ఒక్క సినిమా లోనే నాలుగు, ఐదు రకాలుగా మార్చుకుంటూ ఉంటారు.

అంతే తప్ప వాళ్ల వల్ల కాదు అని తప్పించుకోరు అందుకే వాళ్ళకి ఇండస్ట్రీ లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అని చెప్పాలి.నిజంగా ఒక సినిమా కోసం ఇంత చేసే నటులు ఉన్నారా అని మరికొందరు ఆశ్చర్య పోయేలా వీళ్ళు వాళ్ల బాడీ ని మార్చుకుంటూ ఉంటారు.

ఇక ఇదే పద్ధతిని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ( TOllywood ) కూడా ఫాలో అవుతుంది.అందుకే ఇక్కడ హీరోలు చేసిన ప్రతి పాత్ర కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఇక సినిమా సినిమా కి వేరియేషన్స్ చూపించే మన హీరోలు ఒక క్యారెక్టర్ కోసం చాలా రకాలుగా కష్టపడుతున్నారు.అందుకే ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా గా పేరు సంపాదించుకుంది.

Advertisement
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

తాజా వార్తలు