అవును, మీరు విన్నది నిజమే.ఉప్పు నీటి( Salt water)తో కొలంబియన్ రినవెబుల్ ఎనర్జీ ఈ డినా ( Colombian Renewable Energy E Dina )డెవలప్ చేసిన వాటర్ లైట్ ఇపుడు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ కొత్త లాంతర్ పవర్, లైట్‌ను అందిస్తుండడం విశేషం.సముద్రం నుంచి న్యాచురల్ పద్ధతుల్లో దీనిని తయారు చేయడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
ఈ లాంతర్ తయారీకి కేవలం 2 కప్పుల సాల్ట్ వాటర్ ని మాత్రమే వాడారు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం.ఈ లాంతర్ తో 45 రోజుల వరకు క్లీన్ రినవెబుల్ ఎనర్జీని( Clean renewable energy ) తయారు చేస్తున్నారు.
రియోట్ ఏరియాల్లో నివసించే వారికి ఈ వాటర్ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.అదేవిధంగా కరెంట్ లేని ప్రదేశాల్లో నివసించే వారికి కూడా ఎలక్ట్రిసిటీగా ఇది ఉపయోగపడుతోంది.

ఈ వాటర్ లైట్ ఎకో ఫ్రెండ్లీ( eco friendly )తో పాటు100 శాతం రిసైక్లెబుల్ మరియు వాటర్ ప్రూఫ్ కావడం విశేషం.ఈ కారణంగా ఇది విశేషంగా జనాలను ఆకర్షిస్తుంది.ఎక్కువ రోజులు మన్నిక ఇవ్వడం, స్థిరంగా పని చేయడం ఈ వాటర్ లైట్ ప్రత్యేక గుణాలు.ఈ వాటర్ లైట్ పూర్వీకుల మనుగడకు సాక్ష్యంగా నిలుస్తోంది అనడంలో సందేహమే లేదు.
ఈ వాటర్ లైట్ ని కొలంబియా, వెనిజులా దేశంలోని సముద్ర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న రిమోట్ ఏరియాలో గుయాజిరా ద్వీపకల్పంలో నివసించే వారు విరివిగా వాడుతున్నారు.ఈ వాటర్ లైట్ ఇక్కడ నివసించే వారి ఎకనమిక్ గ్రోత్ కు, మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది అనడంలో సందేహమే లేదు.

ఈ వాటర్ లైట్ కనిపెట్టక మునుపు పలు పట్టే వారు రాత్రి పూట చాలా ఇబ్బందులు పడేవారు.ఈ ప్రాంతంలో నివసించే చిన్నారులు తమ హోం వర్క్ ని ప్రమాదకరమైన క్యాండిల్ లైట్ కింద చేసుకునే పరిస్థితి ఉండేది.అది ఇపుడు మారిందని చెప్పుకోవాలి.ఇక్కడ నివసించే వారు సెల్ ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవడానికి సైతం ఇబ్బంది పడేవారు.ప్రస్తుతం వాటర్ లైట్ రాకతో వారి జీవితాలు మారిపోయాయని చెబుతున్నారు.ఈ అద్భుతమైన లాంతర్ ఎలక్రోలైట్ యొక్క ఓనిజేషన్ ను వినియోగించుకుంటుంది.
ఉప్పునీటిలో ఉండే మెగ్నిషియంను ఇది కన్వర్ట్ చేసుకుంటుంది.అయాన్ల బదిలీని విస్తరించడానికి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ను ప్రత్యేకంగా రూపొందించారు.