స్మార్ట్ గ్యాస్ స్టవ్ ని కనిపెట్టిన 13ఏళ్ల పిల్లాడు... పాస్‌వర్డ్‌తో ఆన్, ఆఫ్ చేసేయొచ్చు, నో గ్యాస్ లీక్!

గ్యాస్ స్టవ్ తో మన ఇంటి ఆడవాళ్లు ఒక్కోసారి రకరకాల ఇబ్బందులకు గురవుతూ వుంటారు.ముఖ్యంగా లీకేజ్ విషయంలో కాస్త అసహనాన్ని గురవుతూ వుంటారు.

 13years Old Bihar Boy Smart Gas Stove Manipulated With Password Without Gas Leak-TeluguStop.com

మనలో బ్యాచిలర్స్ ఉంటే వారికి కూడా ఈ కష్టాలు తెలిసిందే.అయితే అలాంటి ఒక గ్యాస్ స్టవ్ కి అలారం అమర్చి గ్యాస్ లీక్ అయినప్పుడు అదే మోగితే ఎలాగుంటుంది.

ఐడియా బాగానే వుంది కానీ, అలాంటి గ్యాస్ స్టవ్( Gas Stove ) ఇపుడు మార్కెట్లో దొరికేనా? అనే అనుమానం మీకు కలగక మానదు.అయితే అలాంటివి ఇప్పటి వరకు రాలేదు కానీ, మున్ముందు అలాంటివి చూడొచ్చు.

Telugu Boy, Bihar Boy, Biharboy, Gas Leakages, Gas Leakage, Password, Prathyush,

బీహార్‌కు చెందిన 13 ఏళ్ల ప్రత్యూష్( Prathyush ) ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి శెభాష్ అనిపించుకున్నాడు.అవును, మాధేపురా నివాసి అయినటువంటి ప్రత్యూష్ అలాంటి స్మార్ట్ గ్యాస్ స్టవ్‌( Smart Gas Stove ) ఒకదానిని తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.దీని ప్రత్యేకత ఏమంటే అది పాస్‌వర్డ్‌తో ఆన్ అవుతుంది.అదేవిధంగా గ్యాస్ లీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది.గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.కొన్ని సెకన్లకు మించి గ్యాస్ లీక్ అయితే ఆటోమేటిక్‌గా ఇంటి మొత్తం కరెంటు కూడా ఆగిపోవడం ఇందులోని ప్రత్యేకత.

Telugu Boy, Bihar Boy, Biharboy, Gas Leakages, Gas Leakage, Password, Prathyush,

కాగా ఇది కేవలం 3 వేల రూపాయలకే ప్రజలకు అందేలా ప్లాన్ చేస్తున్నారు.దీన్ని తయారు చేయడానికి అతనికి దాదాపు 1,500 రూపాయలు ఖర్చు అయ్యిందట.అయితే మార్కెట్‌లో రూ.3,000 వరకు అమ్ముడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇకపోతే నిపుణులు ఏం చెబుతున్నారంటే గ్యాస్ లీక్ ఐనప్పుడు కంగారు పడకుండా ఉండాలి.ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్‌లను అస్సలు ఆన్ చేయవద్దు.వంటగది, ఇంటి కిటికీలు, తలుపులు ముందుగా తెరవాలి.రెగ్యులేటర్ ఆన్‌లో ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.

ఒకవేళ ఆన్ లో ఉంటె వెంటనే దాన్ని ఆఫ్ చేయండి.రెగ్యులేటర్‌ని ఆపివేసిన తర్వాత కూడా రెగ్యులేటర్‌ని తీసి సేఫ్టీ క్యాప్ ని పెట్టండి.

ఇంకా గ్యాస్ లీక్ కాకుండా చూసుకోవడానికి.రెగ్యులేటర్ అదేవిధంగా గ్యాస్ పైపును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube