కోర్టులో బిడెన్ కి చిక్కెదురు...మళ్ళీ ట్రంప్ గెలిచాడుగా...!!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కి టైం అస్సలు బాలేదా అంటే బాగోలేదనే చెప్పాలి.

ఎందుకంటే అధ్యక్షుడిగా బిడెన్ అధికారంలో ఉన్నా సరే ఆయన తీసుకునే పలు నిర్ణయాలకు అమెరికా కోర్టులు మోకాలడ్డుతున్నాయి.

ట్రంప్ సమర్ధించిన ప్రతీ ఒక్క అంశం ప్రజా వ్యతిరేకంగా ఉన్నవే కావడంతో ప్రజల కోరిక మేరకు పలు వివాదాస్పద అంశాలపై బిడెన్ బహిరంగంగా ప్రజలకు మద్దతు ఇచ్చారు.అంతేకాదు ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేసే విధంగా చట్టాలని రూపొందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ అమెరికా కోర్టులు మాత్రం బిడెన్ ప్రయత్నాలపై నీళ్ళు చల్లుతున్నాయి.గడిచిన కొంత కాలంగా మహిళల అబార్షన్ హక్కుల విషయంలో జరిగిన నిరసనల నేపధ్యంలో కోర్టు మహిళలకు వ్యతిరేకంగా తీర్పు వెల్లడించింది.

ఈ తీర్పుపై బిడెన్ తీవ్ర నిరసన వ్యక్త పరిచారు.కానీ ట్రంప్ మాత్రం తాను అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయానికే కోర్టులు కూడా మద్దతు పలుకుతున్నాయని తాజా కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేసారు.

Advertisement
They Beat Biden In The Court. Trump Won Again, Joe Biden, Trump , Court, Ameri

అలాగే గన్ కల్చర్ పై నియంత్రణ చట్టాలను తీసుకురావాలని ప్రయత్నించిన సమయంలో కూడా కోర్టు గన్ కల్చర్ కు మద్దతుగా తీర్పు చెప్పింది.ఈ విషయంలో కూడా ట్రంప్ కోర్టు తీర్పును స్వాగతించారు.

ఎందుకంటే ముందు నుంచీ రిపబ్లికన్ పార్టీ గన్ కల్చర్ కు మద్దతును ఇస్తూనే ఉంది.ఇక తాజాగా.

They Beat Biden In The Court. Trump Won Again, Joe Biden, Trump , Court, Ameri

పర్యావరణం లో సంభవిస్తున్న మార్పులపై చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు బిడెన్ కొంత కాలంగా కృషి చేస్తున్నారు.ప్రత్యేకమైన విధానాల ద్వారా కొత్త చట్టాలని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే అమెరికా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

అమెరికాలో ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచీ వచ్చే కర్బర ఉద్గారాల నియంత్రణ కోసం ప్రత్యేకమైన అధికారాలను పర్యావరణ పరిరక్షణ సంస్థకు ఇస్తూ గతంలో ప్రభుత్వం చట్టాలని తీసుకువచ్చింది.ఈ అధికారాలను రద్దు చేస్తూ తాజాగా కోర్టు తీర్పు వెల్లడించింది.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

ఈ తీర్పు వెల్లడించిన బెంచ్ లో మొత్తం 9 మంది న్యాయమూర్తులు ఉండగా వారిలో ముగ్గురు తీర్పుకు వ్యతిరేకంగా ఉంటే మిగిలిన ఆరుగురు తీర్పును సమర్ధించారు, కాగా ఈ ఆరుగురిఓ ముగ్గురు ట్రంప్ సమయంలో నియమించబడిన వారు కావడం గమనార్హం, గతంలో ట్రంప్ వాతావరణంలో మార్పుల కోసం చట్టాలని తీసుకురావడం శుద్ద దండగగా అభివర్ణించారు.అయితే తాజాగా కోర్టు తీర్పుతో ఈ విషయంలో కూడా గతంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకే కోర్టు మద్దతు తెలిపినట్టయ్యిందని ట్రంప్ పై చేయి సాధించాడని అంటున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు.

Advertisement

తాజా వార్తలు