రాజస్థాన్ ఆల్ రౌండర్ తెవాతియా కు బెంగళూర్ మరియు భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జెర్సీ ను బహుకరించారు, పైగా దానిపై ” డియర్ రాహుల్… బెస్ట్ విషెస్ ” అని రాసి ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు.శనివారం రాజస్థాన్ మరియు బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ లక్ష్య చేదనలో బరిలోకి దిగిన తెవాతియా మొదట నెమ్మదిగా ఆడాడు, అతను 19 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే కొట్టాడు, ఆ తరువాత ఆడిన 12 బంతుల్లో ఏకంగా 45 పరుగులు కొట్టి జట్టుకు విజయం అందించాడు.
పంజాబ్ బౌలర్ కాట్రేల్ వేసిన ఓవర్ లో ఏకంగా 5 సిక్సర్ లు బాది ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
బెంగళూర్ నిలకడగా రాణించడం తో శనివారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు.నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా తెవాతియా 12 బంతుల్లో 24 కొట్టి టీమ్ కు మంచి స్కోర్ అందించడం లో కీలక పాత్ర పోషించాడు.
ఏదైతేనేం ఈసారి ఐపీఎల్ లో మన భారత కుర్రాళ్ళు ప్రతిభ చూపి అందరి ప్రశంసలు పొందుతున్నారు.IPL 2020
.